ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tension at Thullur: తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులు, రైతులకు మధ్య తోపులాట

By

Published : May 13, 2023, 1:36 PM IST

Tension at Thullur

Amaravati Farmers Protest: రాజధాని ప్రాంతం తుళ్లూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా జై భీమ్​ భారత్​ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్, అమరావతి రైతులు అంబేడ్కర్ స్మృతి వనానికి పాదయాత్రగా వెళ్లాలని సంకల్పించారు. అయితే పోలీసులు జడ శ్రావణ్ కుమార్​ను ముందుగానే విజయవాడలో అదుపులోకి తీసుకుని.. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మరోవైరు తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్దకు భారీగా పోలీసుల్ని మోహరించి.. నిరసన చేస్తున్న రైతులను అడ్డుకున్నారు. శాంతియుతంగా చేసే పాదయాత్రకు పోలీసుల ఆంక్షలేంటని రైతులు ప్రశ్నించారు. దీక్షా శిబిరం నుంచి రైతులు, మహిళలు, రైతు కూలీలను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు. దీంతో పోలీసులు, రైతులు మధ్య తోపులాట జరిగింది.  పోలీసులను తోసుకొని బయటికి రావడానికి రైతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది రైతులు దీక్షా శిబిరం వెనుక వైపు నుంచి పొలాల్లోకి వెళ్లి అక్కడ నుంచి స్మృతివనం చేరుకున్నారు. మరికొంతమంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో ఆ తర్వాత పరిమిత సంఖ్యలో స్మృతివనంకు వెళ్లేందుకు అనుమతించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం అమరావతి ఐకాస నేతలు స్మృతివనం వద్దకు వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నినాదాలు చేసి నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details