'వీధి రౌడీలా వీరంగం సృష్టించారు- నాకు, నా కుటుంబానికి పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది' - VICTIM fo MLA PINNELLI

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 5:09 PM IST

thumbnail
'వీధి రౌడీలా వీరంగం సృష్టించారు- నాకు, నా కుటుంబానికి పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది' (ETV Bharat)

Seshagiri Rao, His Family Were Threatened By MLA Pinnelli : పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తించారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్​లోకి పిన్నెల్లి తన అనుచరులతో కలిసి దూసుకువచ్చారు. ఈవీఎంను నేలకేసి కొట్టారని ఆయన వెల్లడించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నించగా తనపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటున్న శేషగిరిరావుతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి.

ఈవీఎం ధ్వంసం సహా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ ఎమ్మెల్యేని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ విషయం జరిగి తొమ్మిది రోజులైనా బయటపడకపోవడంపై సర్వత్రా అనుమానాలు వెళ్లువెత్తుతున్నాయి. ఈసీ నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోలీసులు పిన్నల్లికి శిక్ష తగ్గించే సెక్షన్లలు నమోదు చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లి ఈవీఎం ధ్వసానికి పాల్పడ్డప్పుడు అడ్డుకోబోయిన శేషగిరిరావు ప్రాణభయం ఉందని ఆవేదన చెందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.