ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో రెచ్చిపోయిన పోకిరీలు.. వందే భారత్‌ రైలుపై రాళ్లు

By

Published : Jan 11, 2023, 9:05 PM IST

Updated : Jan 11, 2023, 10:50 PM IST

stones on vande bharat
stones on vande bharat

21:00 January 11

రైలు 2 కోచ్‌ల అద్దాలు ధ్వంసం

వందే భారత్‌ రైలుపై రాళ్లు..రైలు 2 కోచ్‌ల అద్దాలు ధ్వంసం

Vande Bharat express:విశాఖలో పోకిరీలు రెచ్చిపోయారు. విశాఖకు వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌కు ఈరైలును రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్ద రైలును నిలిపి ఉంచారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు రెండు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ రైలు తొలిసారి విశాఖ రైల్వేస్టేషన్​కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఇవాళ ఉదయం రైల్వేస్టేషన్​కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని అందువల్ల ఈ వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతగా ఉంటుందని.. 9.30గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్​కు చేరుకుంటుందని తెలిపారు.

విశాఖ నుంచే రైలు నిర్వహణ జరగనుంది కావున పర్యవేక్షణ నిమిత్తం న్యూ కోచింగ్ కాంప్లెక్స్​కు పంపించారు. లోకో పైలెట్ క్యాబిన్​కు అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ రైలు మొత్తం ఉంది. లోకో పైలెట్ ఆధీనంలో కోచ్​ల ద్వారాలు తెరుచుట, మూయుట వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అత్యవసర సహాయార్ధం ద్వారం వద్ద టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్ ఈ కోచ్ ప్రత్యేకత. ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 11, 2023, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details