ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YS Vivekananda Reddy Murder Case Investigation Updates వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వాయిదా వేసిన సీబీఐ కోర్టు

By

Published : Aug 14, 2023, 5:14 PM IST

Updated : Aug 15, 2023, 6:22 AM IST

YS Vivekananda Reddy murder case investigation updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. నేటి విచారణకు వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు చంచల్‌గూడ జైలులో ఉన్న ఆరుగురు నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
19263416_Viveka_Murder_Case_Updates
19263416_Viveka_Murder_Case_Updates

YS Vivekananda Reddy murder case investigation updates: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన తదుపరి విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసుపై నేడు మరోసారి విచారణ జరిపిన కోర్టు.. విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి విచారణకు వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి, ఉదయ శంకర్‌‌ రెడ్డి, సునీల్ యాదవ్, శివ శంకర్‌ రెడ్డి, ఉదయ కుమార్‌ రెడ్డి, వైఎస్ భాస్కర్‌ రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు.

Viveka murder case Investigation in CBI court: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా పడింది. ఈ కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఈరోజు విచారణ చేపట్టగా.. కేసులో 8వ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో మిగతా నిందితులు లేకపోవడంతో.. కోర్టు కాసేపు విచారణను వాయిదా వేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి, ఉదయ శంకర్‌ రెడ్డి, సునీల్ యాదవ్, శివ శంకర్‌రెడ్డి, ఉదయ కుమార్‌ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను పోలీసులు ఉదయం 11 గంటల సమయంలో కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో ఏడుగురిని కలిపి సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు.

Viveka murder case: వివేక హత్య వార్తను జగన్‌కు ఎవరు చెప్పారు? సీబీఐ విచారణలో కీలక సాక్షుల వాంగ్మూలాలు ఇవే!

Accused Devi Reddy Sivashankar Reddy Bail Petition:మరోవైపు వైఎస్వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. 4 రోజుల క్రితం శివ శంకర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐ అధికారులను ఆదేశించింది. సీబీఐ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 5వ నిందితుడిగా ఉన్నారు.

YS Sharmila with CBI 'జగన్ నాకు మద్దతు ఇవ్వడని ముందే తెలుసు..! పైపైకి బాగానే ఉన్నా.. లోపల కోల్డ్ వార్!'

CBI chargesheet on Sivashankar Reddy involvement: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని.. హత్యానంతరం సంఘటనా స్థలానికి వెళ్లి, సాక్ష్యాలు చెరిపివేశారని.. సీబీఐ అధికారులు ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్నారు. 2017లో శివశంకర్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఆశించినప్పటికీ.. వివేకా అడ్డుకున్నారని, దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలిసి హత్యకు కుట్ర పన్నారని సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుపై మరోసారి విచారించిన సీబీఐ న్యాయస్థానం.. సెప్టెంబర్ 1వ తేదీకి విచారణను వాయిదా వేసింది. విచారణ ముగిసిన అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మిగతా ఆరుగురు నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Buddha Venkanna on Sharmila: వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి: బుద్దా వెంకన్న

Last Updated :Aug 15, 2023, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details