ETV Bharat / state

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై వెంటనే కేసు పెట్టని అధికారులు - ఎన్నో అనుమానాలు! - MLA Pinnelli Destroying EVM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 9:12 AM IST

MLA Ramakrishna Reddy Destroying EVM But Not Filing a Case Immediately: ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై వెంటనే కేసు పెట్టకుండా, అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందా? కేసు పెట్టడంలో జాప్యం చేయడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్​లో మొదట ఆయన పేరు చేర్చలేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అందరు అధికారుల ప్రమేయముందన్న అనుమానాలు వస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై వెంటనే కేసు పెట్టని అధికారులు - ఎన్నో అనుమానాలు! (ETV Bharat)

MLA Pinnelli Ramakrishna Reddy Destroying EVM But Not Filing a Case Immediately : ఈనెల 13న మాచర్లలో జరిగిన విధ్వంసంలో సీసీ టీవీ వీడియో బయటకు వచ్చేంత వరకూ నిందితుల జాబితాలో ఎమ్మెల్యే పిన్నెల్లి పేరును చేర్చకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి మధ్యాహ్నం సమయంలో పోలింగ్‌ సిబ్బందితో సహా అందరూ చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరికొడితే గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడాన్నిబట్టే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేశారో అర్థమవుతోంది.

పోలీసుల కన్నుగప్పి సినీ ఫక్కీలో పిన్నెల్లి పరార్‌! - ముమ్మరంగా గాలింపు - Pinnelli Ramakrishna Reddy Escaped

పోలింగ్‌ కేంద్రంలో 13న మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన సంఘటనలు సీసీ టీవీలో రికార్డు అవడంతో పాటు అక్కడి పోలింగ్‌ సిబ్బందీ సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. కానీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్‌ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఎమ్మెల్యేపై భయభక్తులతో ఫిర్యాదు చేసేందుకు పోలింగ్‌ అధికారి ముందుకు కాలేదు. గుర్తుతెలియని వ్యక్తులు కంట్రోల్‌ ప్యానల్, వీవీ ప్యాట్‌ యంత్రాలను ధ్వంసం చేశారని స్థానిక వీఆర్వో ఈనెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లూ దీనిలో ప్రస్తావించలేదు.

అగమ్యగోచరంగా పిన్నెల్లి రాజకీయ జీవితం - ఏడేళ్లకు తగ్గకుండా శిక్షపడేనా? - Pinnelli Political Career

ఈవీఎంల ధ్వంసం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ ఫుటేజిని పోలింగ్‌ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా బుధవారం చెప్పారు. కానీ ఎమ్మెల్యే పేరు మొదటే ఎఫ్ఐఆర్​లో చేర్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పాలన యంత్రాంగాన్ని నడిపే అత్యున్నత అధికారే వైఎస్సార్సీపీకు మేలు చేసేలా వ్యవహారించినప్పుడు కిందిస్థాయి అధికారులు ఆయన బాటలో నడవడంలో ఆశ్చరమేముందన్న విమర్శలూ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజి బయటకు రావడం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడంతో ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చారని లేకుంటే ఆ నిజాన్ని సమాధి చేసేవారన్న విమర్శలొస్తున్నాయి.

పిన్నెల్లి సోదరుల అరాచకాలు, దౌర్జన్యాలపై పోలీసులు 'మౌనవ్రతం' - ఎందుకో చెప్తారా సార్? - Police Silent in MACHERLA incident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.