తెలంగాణ

telangana

రైతుకు కన్నీరే మిగిలిస్తున్న మిరప - ఆటుపోట్లను తట్టుకుని సాగుచేస్తే పెట్టుబడీ కష్టమే!

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 2:27 PM IST

Mirchi Farmers Problems

Mirchi Farmers Problems : ఆశల పంట మిరప రైతుకు కన్నీరే మిగిలిస్తోంది. ఈ సీజన్​లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సాగుచేసి కొద్దో గొప్పో దిగుబడి వస్తుందని కొండంత ఆశతో పంటను తీస్తున్న సాగుదారులకు తీరా చేతికొచ్చే సమయంలోనూ పరీక్షలు తప్పడం లేదు. ఓ వైపు కూలీల కొరత, ఇంకోవైపు తెగుళ్ల దెబ్బతో మిరప సాగుదారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. చేతికొచ్చే సమయంలో తెగుళ్ల దెబ్బకు రంగు మారుతున్న మిర్చిని కాపాడుకునేందుకు వేలకు వేలు ధారపోసి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక్కో రైతు ఎకరాకు అదనంగా రూ.10 వేల వరకు ఖర్చు చేసి పంటలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  

Mirchi Farmers Demand For MSP : అయినప్పటికీ తోటలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. రంగు మారిన కాయలు కలిపిన మిరపను మార్కెట్​కు తీసుకెళ్తే అక్కడా అనేక సాకులు చూపి గణనీయంగా ధరలు తగ్గిస్తున్నారని సాగుదారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి అత్యంత దయనీయంగా మారిన మిరప రైతుల దీనగాథలపై ప్రత్యేక కథనం.

ABOUT THE AUTHOR

...view details