తెలంగాణ

telangana

స్వీట్​ షాప్​లో ఘోర అగ్నిప్రమాదం - సుమారు రూ. పది లక్షల ఆస్తి నష్టం

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 7:17 PM IST

Fire Accident at Sweet Shop in Warangal

Fire Accident at Sweet Shop in Warangal : రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వరంగల్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని వాసవి కాలనీలో స్వాగత్​ స్వీట్ హౌస్​లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోయినప్పటికీ భారీ మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఫర్నిచర్​తో పాటు మిఠాయిలు అగ్నికి అహుతి అయ్యాయి. సుమారు రూ.పది లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు.  

Massive Fire Accident in Warangal District : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. దుకాణంలో ఎలాంటి ఫైర్​ సేఫ్టీ పరికరాలు లేకపోడంతోనే షాపు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details