తెలంగాణ

telangana

ఆదిలాబాద్‌ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలకు పకడ్భందీ ఏర్పాట్లు : ఎస్పీ ఆలం గౌస్ - Adilabad SP Alam Gaush Interview

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 4:56 PM IST

Adilabad SP Alam Gaush Special Interview

Adilabad SP Alam Gaush Special Interview : పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించడాన్ని పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. మూడు వైపుల మహారాష్ట్రతో అనుసంధానమై ఉండటం, మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రతో అనుసంధానమై ఉండే ఆరు మార్గాల్లో నిఘాను పటిష్టం చేసిన పోలీస్‌ యంత్రాంగం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయించింది.

Police Dept Focus on Elections : ఎన్నికల్లో నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ స్వయంగా వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల నియమావళిని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ ​శాఖ పరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, చట్టానికి లోబడే చర్యలుంటాయంటున్న ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పోలీస్ నోడల్‌ అధికారి ఆలం గౌస్‌తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details