తెలంగాణ

telangana

ఈదురుగాలులకు కూలిన మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన - BRIDGE COLLAPSES IN MANAIR VAGU

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 9:25 AM IST

Updated : Apr 23, 2024, 2:29 PM IST

Under Construction Bridge Collapses in Manair Vagu : మానేరు వాగులో నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు ఈదురుగాలులకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ ఘటన సోమవారం రాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన జరిగింది.

Bridge Girder Construction Collapses in Manair Vagu
Bridge Girder Construction Collapses in Manair Vagu

ఈదురుగాలులకు కూలిన మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన

Under Construction Bridge Girder Collapses in Manair Vagu : ఈదురుగాలులకు మానేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్​ వంతెన సిమెంట్​ గడ్డర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో జరిగింది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయింది. ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు కూడా కాస్త ఊపిరి తీసుకున్నారు. అయితే కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వంతెనను జయశంకర్​ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం గర్మళ్లపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : సోమవారం అర్ధరాత్రి వీచిన గాలి దుమారానికి మానేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్​ వంతెన సిమెంట్​ గడ్డర్స్​ కూలిపోయాయి. పెద్దపల్లి జిల్లా మానేరు వాగుపై దాదాపు రూ.46 కోట్లతో 2016లో వంతెన నిర్మాణానికి అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం 2023-24 లో మరోక రూ.11 కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. ఇది పూర్తి అయితే ఉమ్మడి వరంగల్​, కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాలకు రవాణా మెరుగుపడుతుంది.

Karimnagar Cable Bridge Cracks : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించి నెల కాకముందే పగుళ్లు

ఈ వంతెన పూర్తయితే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామం, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలు సాఫీగా సాగేవి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. గత తొమ్మిదేళ్లుగా నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.

ఈ వంతెన పక్కనే తాత్కాలిక మట్టి రహదారి నిర్మాణం చేసి ఇరువైపులా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ రహదారిపై రాత్రి రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు తెలుపుతున్నారు. నిర్మాణం పూర్తి కాకముందే నేలకొరగడంతో నాణ్యత లోపం ఉందని, పూర్తి బాధ్యత సంబంధిత గుత్తేదారు, అప్పటి ఎమ్మెల్యే, జడ్పీటీసీ పుట్ట మధుకర్​ బాధ్యత వహించాలని, ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఐదేళ్ల తర్వాత బయటపడ్డ గ్రామాలు- భావోద్వేగానికి గురైన మిడ్​ మానేరు నిర్వాసితులు

మిడ్​ మానేరు నిర్వాసితుల్లో చిగురిస్తున్న ఆశలు - కుటీర, ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళికలు

Last Updated : Apr 23, 2024, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details