తెలంగాణ

telangana

తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు - పలుచోట్ల విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించని అధికారులు

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 7:55 PM IST

Telangana Intermediate Exams : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 15వందల 21 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. నిబంధనలను కఠినంగా అమలు చేసిన అధికారులు నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారుల తీరును నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Telangana Intermediate Exams
Telangana Intermediate Exams

తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు - పలుచోట్ల విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించని అధికారులు

Telangana Intermediate Exams : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. మెుత్తం 4 లక్షల 88 వేల 113 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 19 వేల 641 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఇంటర్ బోర్డ్ (Inter Board) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 15వందల 21 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. విద్యార్థులు (Student) కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించ లేదు. ఎవరైనా కాపీ కొట్టినా ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

INTER EXAMS 2022: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

Inter Exams : హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని కేమ్ బ్రిడ్జి కళాశాల వద్ద నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావటంతో అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. వికారాబాద్‌లోని సిద్ధార్థ కళాశాలలో (Vikarabad Siddhartha College) పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ముగ్గురిని అనుమతించలేదు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన ఐదుగురిని అధికారులు పరీక్షలకు అనుమతించ లేదు. సాగర్ ప్రభుత్వ కళాశాల కేంద్రం నుంచి ఇద్దరు, మిర్యాలగూడ సెంటర్ నుంచి ముగ్గురు విద్యార్థులు వెనుదిరిగారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Govt Junior College) ఆలస్యంగా వచ్చిన కారణంగా ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. కరీంనగర్, నిజామాబాద్, జనగామలో మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదైయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థికి గాయాలు

ఇంటర్‌ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరడిగొండ మండలం వడూర్‌ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌ (17) ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు బుధవారం ఉదయం బైక్‌పై ఇచ్చోడకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో హైవేపై బస్సు నిలిపి ఉండటంతో వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. దీంతో విద్యార్థి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఇచ్చోడ పీహెచ్‌సీనకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

Inter 1st year exams 2021: 'ధైర్యంగా ఉండండి... ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి'

TS Inter 1st year Exams: అక్టోబరు 25 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details