ETV Bharat / state

Inter 1st year exams 2021: 'ధైర్యంగా ఉండండి... ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి'

author img

By

Published : Oct 21, 2021, 7:25 PM IST

Updated : Oct 21, 2021, 7:38 PM IST

ప్రమోటైన ఇంటర్ మొదటి సంవత్సరం (Inter 1st year exams 2021) విద్యార్థులకు సమయం అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే చెప్పామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) తెలిపారు. ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయినందున పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పరీక్షల సమయంలో అయోమయం సృష్టించకుండా సహకరించాలని మంత్రి కోరారు.

ఇంటర్
Inter

'ధైర్యంగా ఉండండి... ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి'

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు (Inter 1st year exams 2021) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) వెల్లడించారు. ఇవాళ వివిధ శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ (Sabitha Indra Reddy Video Conferance) నిర్వహించారు. గతంలో కరోనా పరిస్థితుల వల్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశామని.. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ముందే చెప్పామని మంత్రి వివరించారు.

ఇంటరే టర్నింగ్ పాయింట్...

విద్యార్థుల భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ కాబట్టి... పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 58వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలను 1,400 నుంచి 1,750కి పెంచినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొన్ని పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ టీకాలు వేసుకున్న 25వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారన్నారు.

గంట ముందు నుంచే...

గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి (Inter 1st year exams 2021) అనుమతిస్తామని.. ముందు జాగ్రత్తగా కేంద్రంలో ఓ ఐసోలేషన్ గదిని సిద్ధంగా ఉంచుతామని, మాస్కులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మంచినీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నాని.. ప్రతీ జిల్లాలో సమన్వయ, పర్యవేక్షణ, హైపవర్ కమిటీలు ఉంటాయన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రశ్నల్లో ఎక్కువగా ఛాయిస్ ఉంటాయని... స్టడీ మెటీరియల్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉందన్నారు.

అయోమయం సృష్టించవద్దు...

ప్రైవేట్ కాలేజీల పరీక్షల వేళ డిమాండ్లు ముందు పెట్టి విద్యార్థుల్లో అయోమయం సృష్టించవద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని... పరీక్షలకు మాత్రం సహకరించాలని కోరారు.

దాదాపుగా 4 లక్షల 58వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా ఉండండి. మీరు చదువుకున్న దాంట్లో నుంచి ప్రశ్నలు వస్తాయి. మంచి స్టడీ మెటీరియల్ ఇచ్చాం. దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఆన్​లైన్ క్లాసులు కూడా కండక్ట్ చేశాం. మీరందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారని విశ్వాసం ఉంది. గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తాం.

-- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

హల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చు...

ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని ఆ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వెబ్​సైట్​లో అప్​లోడ్ చేశామని.. సాయంత్రం 5 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి నవంబరు 3 వరకు ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్​లో వివరాలు తప్పుగా ఉంటే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు.

Last Updated : Oct 21, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.