తెలంగాణ

telangana

790 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన దాన కర్ణుడు మన పీవీ

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 7:01 PM IST

PV Narasimha Rao Donated 790 Acres for Land Reform Act : అన్ని రంగాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన ముద్రను చాటుకుని, పేరు ప్రఖ్యాతను పెంచుకున్నారు. అయితే 1971లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణ చట్టం అమలుకు తన 790 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి దానకర్ణుడని అనిపించుకున్నారు. ఇప్పుడు ఆ భూమే నిరుపేదల ఆకలి తీర్చే కల్పతరువుగా మారుతుంది. ఇప్పుడు దేశ అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న స్వీకరించి తెలుగుజాతి గౌరవాన్ని దశదిశలా వ్యాపించారు.

PV Narasimha Rao
PV Narasimha Rao Donated 790 Acres for Land Reform Act

PV Narasimha Rao Donated 790 Acres for Land Reform Act :బహుభాషాకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అపర చాణుక్యుడు, సాహితీవేత్త, అంతేకాదు దానకర్ణుడుగా కూడా మన పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు పేరు ప్రఖ్యాతులున్నాయి. 1971 సంవత్సరంలో పీవీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భూసంస్కరణల చట్టం తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఎంతో మంది భూస్వాములు పీవీపై ఒత్తిడి తెచ్చి ఆ చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో తాను ముందుగా మార్గదర్శకంగా ఉండాలని తన భూములను భూసంస్కరణల చట్టం(Land Reform Act) కింద ప్రభుత్వానికి అందించాలని భావించారు. రెవెన్యూ అధికారులను ఆ చట్టం అమల్లోకి తీసుకురావాలని కోరుతూ చట్టం ప్రకారం తన భూమిని ప్రభుత్వానికి అప్పగించలాని కోరారు.

పీవీకి తల్లిదండ్రుల నుంచి వెయ్యి ఎకరాల భూమి ఆస్తిగా సంక్రమించింది. భూ సంస్కరణల చట్టం ప్రకారం భాగాణా కింద భూములను అప్పగించేవారు. భూస్వాముల భూముల్లో ఉన్న గుట్టలు, కుంటలు, సారవంతమైన భూములు, అక్రరకు రాని నేలలు తదితర స్థలాలను కలిపి ఇందులో ప్రభుత్వానికి భూసంస్కరణల చట్టం కింద ఎంత నిష్పత్తిలో భూమని అప్పగించాలో తెలియచేసేదే 'భాగాణా' పద్ధతి. ఈ లెక్కల ప్రకారం పీవీ నరసింహారావు తనకు చెందిన 790 ఎకరాల భూమిని భూసంస్కరణల కింద ప్రభుత్వానికి అప్పింగినట్లు రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి.

భావిగతిని మార్చిన భారతరత్న పీవీ నరసింహా రావు - ఈ విషయాలు తెలుసా?

Bharat Ratna PV Narasimha Rao :స్వయంగా ముఖ్యమంత్రే మార్గదర్శకంగా నిలవడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని భూస్వాములు వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించక తప్పలేదు. పీవీ నరసింహారావు ప్రభుత్వానికి అప్పగించిన సీలింగ్​ భూమి(Ceiling Land)ని వంగర, రంగయ్యపల్లి, రాంనగర్​, గట్లనర్సింగాపూర్​ శివారు ప్రాంతంలోని 478 మంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు భూమిని పంచి పట్టాలు అందజేశారు. ఆయన పంచిన భూములతో ప్రస్తుతం ఎంతో మంది నిరుపేదలు కడుపు నిండా తిండి తినగలుగుతున్నారంటే అతిశయోక్తి కాదు.

పేదల ఆకలి తీర్చుతున్న పీవీ కుటుంబం : ప్రస్తుతం పీవీ పేరు మీద 60 ఎకరాల చొప్పున మాత్రమే భూమి ఉంది. సేద్యానికి అనువైన ఈ భూముల్లో సైతం పీవీ కుటుంబ సభ్యులు ఎన్నడూ వ్యవసాయ సాగు చేయలేదు. పీవీ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉండే కొంత మంది భూములను సేద్యం చేసుకొని అందులో వచ్చే లాభాన్ని పొందేవారు. కేవలం పీవీ కుటుంబ సభ్యులు 10 ఎకరాల మామిడి తోటలో వచ్చే పండ్లను మాత్రమే ఆశించే వారు. ఆ తోట కూడా నేడు నిరాదరణకు గురై 80 శాతం మామిడి చెట్లు ఎండిపోయాయి.

ప్రతి ఏడాది కార్తీక మాసం రోజున వంగరకు వచ్చే పీవీ కుటుంబ సభ్యులు అన్నదానం చేసేవారు. ఈ సందర్భంగా భూముల గూర్చి ప్రస్తావన వచ్చినప్పుడు మాకెందుకు మేము ఎట్లాగు వ్యవసాయం చేయం, కనీసం పేద ప్రజలనైన బతకనివ్వండంటూ పేర్కొని తమ మంచి మనసును చాటుకునేవారు. పీవీ కుటుంబ సభ్యుల పేర్లమీద ఉన్న భూములను సైతం వంగరలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు విరాళంగా అందించేవారు.

పీవీ రాజకీయ జీవితంలో ఆ ఐదేళ్ల కాలం ఎంతో కీలకం, చరిత్రాత్మకం

చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ నరసింహారావు'

ABOUT THE AUTHOR

...view details