తెలంగాణ

telangana

రేస్‌ ట్రాకుల్లా హైదరాబాద్‌ రహదారులు - మితిమీరిన వేగంతో ప్రాణాలు తీస్తున్న మందుబాబులు - Hyderabad Road Accidents

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 12:28 PM IST

Road Accidents In Hyderabad : హైదరాబాద్‌ మహానగర రోడ్లు రేసుట్రాకుల్లా మారిపోతున్నాయి. మద్యం మత్తులో కొందరు, అతివేగంతో మరికొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రాణాల్ని బలితీసుకుంటూ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. మహానగరంలో ఇటీవల పెరిగిపోతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Road Accidents In Telangana
Road Accidents In Hyderabad

రేస్‌ ట్రాకుల్లా హైదరాబాద్‌ రోడ్లు - మితిమీరిన వేగంతో ప్రమాదాలు చేస్తున్న మందుబాబులు

Cause Of Hyderabad Road Accidents :హైదరాబాద్‌ రోడ్లు వరుస ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. తప్పతాగి రోడ్డెక్కి కొందరు, మితిమీరిన వేగంతో మరికొందరు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐటీ ఉద్యోగి బీభత్సం సృష్టించాడు. ఐకియా నుంచి కామినేని ఆసుపత్రి వరకు గంట వ్యవధిలో ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఇందులో ఒకరు మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. వాహనం నడిపిన వ్యక్తికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో రీడింగ్‌ 550గా చూపించింది.

Road Accidents In Telangana :ఈ నెల 14న వనస్థలిపురంలో యూటర్న్ తీసుకుంటున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఘటనలో రవి, ప్రణయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోనే ఓ లారీ డ్రైవరు అర్థరాత్రి వేళ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వాహనదారుడు బంపర్‌కు వేలాడుతున్నా పట్టించుకోకుండా దూసుకెళ్లిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక దుర్గం చెరువు తీగల వంతెనపైన వాహనదారుల తీరుతో తరచూ ప్రమాదాలుజరుగుతున్నాయి. ఇటీవల బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీ కొట్టి ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసులో వాహనం నడిపిన నవీన్ అనే యువకుడు మద్యం సేవించినట్లు గుర్తించారు.

ఫూటుగా మందేసి రోడ్డు మీదకొచ్చాడు - గంటలో​ ఆరు ప్రమాదాలు చేశాడు - బ్రీత్​ఎనలైజర్​ రీడింగ్ చూస్తే! - Man Caused Six Accidents in Hyd

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు :హైదరాబాద్‌ రోడ్లపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బైక్‌ రేసింగ్‌లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. వేగంగా దూసుకెళ్తూ అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఐటీ కారిడార్, ఇతర ఖాళీ రోడ్లపై ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలపై రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, ఐటీ కారిడార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సరదా స్టంట్లు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ హైదరాబాద్‌ పరిధిలో 2312 రోడ్డు ప్రమాదాలుజరగగా 280మంది మృతి చెందారు. రాచకొండ పరిధిలో 3524 ప్రమాదాలు జరిగితే ఇందులో 584 మంది ప్రాణాలు విడిచారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

మందుబాబులకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మందుబాబులు తప్పించుకుంటున్నారు. కొందరు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారో ముందే సమాచారం ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పబ్బులు, బార్లలో ఎవరైనా మద్యం అతిగా సేవిస్తే వారు వాహనాలు డ్రైవింగ్‌ చేయకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ డ్రైవర్ వచ్చేదాకా వారిని నిలువరించడం లేదా క్యాబ్​లో పంపించాలి. ఇటీవల కొత్త ఏడాది వేడుకల సందర్భంగానూ పోలీసులు పబ్బులు, బార్ల నిర్వాహకులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

Car Accident In Filmnagar Hyderabad : ఈ నగరానికి ఏమైంది.. వరుస కారు ప్రమాదాలు.. అన్ని ర్యాష్‌ డ్రైవింగ్‌లే

Road Accidents in Hyderabad : హైదరాబాద్‌ శివార్లలో ప్రయాణం చేస్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

ABOUT THE AUTHOR

...view details