తెలంగాణ

telangana

వామ్మో బంగారం ధర మరీ ఇంతనా? - ఇలా అయితే కొనడం గగనమే సుమీ!! - Gold Rates High In Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 2:01 PM IST

Gold Rates in Telangana 2024 : పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఆభరణాల ధరలు ఆకాశన్నంటుతుండటంతో పేద, మధ్య తరగతి వారికి పుత్తడి కొనుగోళ్లు కష్టమవుతున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కావటం, మరోవైపు బంగారం ధరలు భగ్గుమంటుండటంతో నగలు కొనాలంటేనే జనం జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్ఠానికి చేరి, పది గ్రాములు బంగారం ధర రూ.73 వేలకు పైగా పలుకుతోంది.

Gold Prices in Telangana
Gold Rates High In Telangana

పరుగులు పెడుతున్న పసిడి ధరలు - రూ.73వేలు పలుకుతున్న పది గ్రాముల బంగారం

Gold Rates in Telangana 2024 :అందమైన ఆభరణాలు మగువల అందానికి మెరుగులు దిద్దటమే కాదు, ఆపదలో ఆదుకుంటుంటాయి. అందుకే మధ్య తరగతి వారు ఎక్కువగా మనసుపెట్టేది పుత్తడిపైనే అని చెప్పాలి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు అనేక సందర్భాల్లో ఆడవారు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. జీవిత కాల గరిష్ఠానికి చేరి, అంతకంతకూ పరుగులు పెడుతున్నాయి.

పెరిగిన డాలర్‌ మారకపు విలువ: ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర పన్నులతో కలిపి రూ.73,150 పలుకుతోంది. వెండి సైతం రూ.80 వేలకు పైగా చేరింది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న సంకేతాలు ఇవ్వటం, అంతర్జాతీయ మార్కెట్​లో బంగారానికి డిమాండ్ పెరగటం, డాలర్ బలపడటం వంటి కారణాలతో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా విపత్తుకు ముందు బంగారం ధర సుమారు రూ.40 వేలు ఉండేది. అప్పట్లోనే కొనాలంటే ధరలు భగ్గుమంటున్నాయని మధ్య తరగతి వారు ఆందోళన చెందిన పరిస్థితి. ఇక ఇటీవలి వరకు రూ.62 నుంచి రూ.65 వేల మధ్య పలికిన బంగారం ధర, ఉన్నట్టుండి రూ.70 వేల మార్కును దాటి, మరింత పైకి ఎగబాకుతోంది.

రూ.73వేలు దాటిన బంగారం - రూ.83వేలకు చేరువలో వెండి! - Gold Rate Today April 6th 2024

Gold Price Hike in Telangana :అయితే బంగారం ధరల్లో పెరుగుదల ప్రధానంగా 1990 నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. గడచిన ఏడాది కాలంలోనే సుమారు రూ.10 వేల వరకు బంగారం ధరలు పెరగటం మధ్య తరగతి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, అనేక కారణాలతో కొనుగోలు చేయలేకపోయామని, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం పెట్టి బంగారం కొనాలంటే కష్టంగా ఉందని పలువురు మహిళలు అభిప్రాయపడుతున్నారు. పుత్తడి ధర ఆకాశన్నంటుతున్నప్పటికీ మరింత పిరం అవుతుందేమో అన్న ఆందోళనతో వినియోగదారులు నగలు కొంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. త్వరలో రూ.80 వేల మార్కును చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

పడిపోయిన బంగారం కొనుగోళ్లు :ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. సాధారణంగా భారత్‌లో వార్షిక బంగారం డిమాండ్‌ సుమారు 50 శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుంది. దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని, ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

బంగారం ధరలకు రెక్కలు - అందుకు గల కారణాలేంటి? - Gold Rates in Telangana

గుడ్ న్యూస్ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today April 5th 2024

ABOUT THE AUTHOR

...view details