తెలంగాణ

telangana

మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు - పోరాడే సైనికులు - 'జన జాతర' సూపర్​ సక్సెస్​ : రేవంత్‌ రెడ్డి - CM Revanth Tweet on Tukkuguda Sabha

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 12:19 PM IST

Updated : Apr 7, 2024, 12:31 PM IST

CM Revanth Response on Tukkuguda Meeting : కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, సైనికులని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. త్యాగశీలులైన కార్యకర్తల త్యాగాల వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆయన, తెగించి కొట్లాడే వీరులుగా అభివర్ణించారు. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్​ జన జాతర సభ విజయవంతమైందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు నీటి బిందువులు కాదన్న సీఎం, పేదల బంధువులుగా ప్రశంసించారు.

CM Revanth Response on Tukkuguda Meeting
CM Revanth Tweet on Tukkuguda Success Meeting

CM Revanth Response on Tukkuguda Meeting : తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ జన జాతర సభకు అనూహ్య స్పందన వచ్చిందని, మహా సముద్రంలా కార్యకర్తలు తరలివచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఓ మహా సముద్రం అని, కార్యకర్తలు నీటి బిందువులు కాదు, పేదల బంధువులని నిన్నటి తుక్కుగూడ జన జాతర సభపై(Tukkuguda Jana Jatara Sabha) సీఎం రేవంత్ ట్విటర్ వేదికగా స్పందించారు.

తుక్కుగూడ సభకు అనూహ్య స్పందన - కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్​ - 14 సీట్లకు ఇక ఢోకా లేదు! - LOK SABHA ELECTIONS 2024

తమ కార్యకర్తలు జెండా మోసే బోయీలు మాత్రమే కాదని, ఎజెండాలు నిర్ణయించే నాయకులని చెప్పుకొచ్చారు. వారు త్యాగశీలులు, తెగించి కొట్లాడే వీరులని తెలిపారు. పోరాడే సైనికులు వారే, పోటెత్తే కెరటాలు వారేనన్నారు. శనివారం తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది, చేసిన శబ్ధమిదంటూ కార్యకర్తలను కొనియాడారు.

Congress Leaders Fires on BRS, BJP :రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం జరిగిన జన జాతర సభలోకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ, రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన(Caste Enumeration) చేపడతామని, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని వెల్లడించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కిషన్ రెడ్డి వైఖరులపై మండిపడ్డారు.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకురాలేదని, గత సీఎం కేసీఆర్ పంది కొక్కుల్లా దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించిన రేవంత్, అక్కడ ఆయన కుటుంబం ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని జోస్యం చెప్పారు.

'పాంచ్​ న్యాయ్​' పేరిట కాంగ్రెస్​ జాతీయ మేనిఫెస్టో రిలీజ్​ : తుక్కుగూడ వేదిక మీద సోనియా గాంధీ 6 గ్యారంటీలు(Congress Six Guarantees) ప్రకటించగా, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టారని, ఇప్పుడు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలను ప్రకటించారని, దేశంలో కూడా అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగులో జాతీయ మేనిఫెస్టోతో పాటు ఐదు గ్యారెంటీలను ప్రకటించి, తెలంగాణ నుంచే ప్రచార భేరిని మోగించారు.

ఫోన్ల ట్యాపింగ్‌పై రాహుల్‌ గాంధీ కామెంట్స్‌ - 'అప్పుడు కేసీఆర్‌ చేసిందే ఇప్పుడు మోదీ చేస్తున్నారు' - Congress Jana Jatara Sabha

చర్లపల్లి జైల్​లో డబుల్​బెడ్ రూం ఇల్లు కట్టిస్తా - కేసీఆర్​కు, సీఎం రేవంత్​రెడ్డి మాస్ వార్నింగ్ - CM Revanth Reddy Speech

Last Updated : Apr 7, 2024, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details