ETV Bharat / politics

తుక్కుగూడ సభకు అనూహ్య స్పందన - కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్​ - 14 సీట్లకు ఇక ఢోకా లేదు! - LOK SABHA ELECTIONS 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 7:11 AM IST

Rahul Gandhi on Phone Tapping Case
Congress Jana Jatara Sabha In Tukkuguda

Congress Jana Jatara Sabha In Tukkuguda : లోక్‌సభ స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎన్నికలకు సమరశంఖం పూరించింది. కాంగ్రెస్‌కు అచ్చివచ్చిన తుక్కుగూడ నుంచి ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారనే అంశంపై మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్‌ గాంధీ, మోదీ, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో కేసీఆర్ మాదిరిగానే కేంద్రంలోని మోదీ సర్కారు పని చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందనే విషయంపై రాహుల్‌ ఆరా తీశారు. ఊహించిన దాని కంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో శ్రేణుల్లో కొత్త జోష్‌ నెలకొంది.

తుక్కుగూడలో జన జాతర భారీ బహిరంగ సభ - ఎన్నికల సమరశంఖం పూరించిన రాహుల్ గాంధీ

Congress Jana Jatara Sabha In Tukkuguda : తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ద్వారా కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరిపి ఆరు గ్యారంటీలను ప్రకటించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికలకు అక్కడే మరింత ఎక్కువగా జన సమీకరణ చేసి ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టోను లాంఛనంగా విడుదల చేసిన ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు గ్యారంటీల గురించి చెప్పడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఫోన్ల ట్యాపింగ్‌పై రాహుల్‌ గాంధీ కామెంట్స్‌ - 'అప్పుడు కేసీఆర్‌ చేసిందే ఇప్పుడు మోదీ చేస్తున్నారు' - Congress Jana Jatara Sabha

ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణం : మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీలు ఉన్నాయని, ఎక్కడికైనా మోదీ వచ్చే ముందే ఈడీ వస్తుందని రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేయని మోదీ ప్రభుత్వం, ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి తెరతీసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే అవినీతిపరులందరినీ బీజేపీలోకి చేర్చుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Rahul Gandhi on Phone Tapping Case : రాష్ట్రంలో దర్యాప్తులో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి అధిక ప్రాధాన్యమిచ్చిన రాహుల్‌ గాంధీ, గత ప్రభుత్వం వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసిందని విమర్శించారు. ఇంటెలిజెన్స్, పోలీస్‌ వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేశారో విచారణలో బయటపడుతుందన్నారు. ట్యాపింగ్‌ ఆధారాలు దొరక్కుండా మూసీ నదిలో పడేశారని ధ్వజమెత్తారు. వ్యాపారులను బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అప్పుడు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిందే, ఇప్పుడు కేంద్రంలో ప్రధాని మోదీ చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంపై ఆరా తీసిన రాహుల్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందనే విషయమై రాహుల్‌ గాంధీ ముఖ్య నేతలను ఆరా తీశారు. గ్యారంటీల అమలుపై ప్రజల స్పందన, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ ప్రణాళిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జనజాతర సభకు ప్రజల సమీకరణ, వారి స్పందన బాగున్నాయని రాహుల్‌ అభినందించినట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో వేదికపై రాహుల్‌గాంధీ కాసేపు ముచ్చటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు తుక్కుగూడ సభ ఎంతగానో దోహదపడుతుందనే అభిప్రాయాన్ని పార్టీశ్రేణులు వ్యక్తం చేశాయి. భారీగా జన సమీకరణపై ఎండల ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన నెలకొన్నా, అలాంటిది లేకుండా జనం తరలిరావడం నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది.

'ఫోన్​ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ జరిపించాలి'- గవర్నర్​కు బీజేపీ నేతల ఫిర్యాదు - BJP leaders meet Governor

చర్లపల్లి జైల్​లో డబుల్​బెడ్ రూం ఇల్లు కట్టిస్తా - కేసీఆర్​కు, సీఎం రేవంత్​రెడ్డి మాస్ వార్నింగ్ - CM Revanth Reddy Speech

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.