తెలంగాణ

telangana

తుమ్మిడిహట్టి వద్ద పాత డిజైన్‌తో ప్రాజెక్టు నిర్మాణానికి పరిశీలిస్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 4:28 PM IST

Updated : Feb 23, 2024, 5:51 PM IST

CM Revanth on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల నివేదిక లేకుండా నిర్ణయాలు తీసుకోలేమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంలోని అన్ని బ్యారేజ్‌లు పరిశీలించాలని ఎన్‌డీఎస్‌ఏకు లేఖ రాశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహట్టి వద్ద పాత ప్రాణహిత చేవెళ్ల డిజైన్‌ ప్రకారం, ప్రాజెక్టు నిర్మించడం ద్వారా నీళ్లు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్‌ వెల్లడించారు.

cm revanth letters to ndsa
CM Revanth on Kaleshwaram Project

CM Revanth on Kaleshwaram Project : సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతిన కాళేశ్వరం బ్యారేజీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల నివేదిక లేకుండా నిర్ణయాలు తీసుకోలేమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంలోని(Kaleshwaram Project) అన్ని బ్యారేజీలను పరిశీలించాలని ఎన్‌డీఎస్‌ఏకు లేఖ రాశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బ్యారేజీలను రిపేర్‌ చేయవచ్చా, రిస్టోర్‌ చేయవచ్చా, శాశ్వతంగా వాటిని తీసేసి కొత్తది కట్టాలా అనే వాటిపై పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు.

CM Revanth on Pranahitha Chevealla Project :ఒకవేళ బ్యారేజీలు కొత్తవి కట్టాలంటే ఏ సాంకేతిక నిపుణులతో కట్టాలనే అంశాలపై వీటన్నింటిపై నివేదికలు ఇవ్వాలని ఏన్‌డీఎస్‌ఏను కోరినట్లు రేవంత్‌రెడ్డి(CM Revanth) తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహట్టి వద్ద పాత ప్రాణహిత చేవెళ్ల డిజైన్‌ ప్రకారం, ప్రాజెక్టు నిర్మించడం ద్వారా నీళ్లు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్‌ వెల్లడించారు. గోదావరి జలాలు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణకు వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్​ రిపోర్ట్​లో​ సంచలన విషయాలు

మేడిగడ్డలోని నీటిని అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు అవగాహనారాహిత్యంగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఓవైపు అన్నారంకి పడిన సీపేజీల మరమ్మతులకు బ్యారేజీలోని నీటిని దిగువకు విడుదల చేస్తుంటే, మేడిగడ్డ నీటిని ఎత్తిపోయాలంటూ అనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

"కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల నివేదిక లేకుండా నిర్ణయాలు తీసుకోలేము. కాళేశ్వరంలోని అన్ని బ్యారేజ్‌లు పరిశీలించాలని ఎన్‌డీఎస్‌ఏకు లేఖ రాశాము. బ్యారేజీలను రిపేర్‌ చేయవచ్చా, రిస్టోర్‌ చేయవచ్చా, శాశ్వతంగా వాటిని తీసేసి కొత్తది కట్టాలా అనే వాటిపై పరిష్కారం చూపాలని కోరాము. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహట్టి వద్ద పాత ప్రాణహిత చేవెళ్ల డిజైన్‌ ప్రకారం, ప్రాజెక్టు నిర్మించడం ద్వారా నీళ్లు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నాము". - సీఎం రేవంత్‌రెడ్డి

తుమ్మిడిహట్టి వద్ద పాత డిజైన్‌తో ప్రాజెక్టు నిర్మాణానికి పరిశీలిస్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి

Dam Safety Team Observations on Medigadda :మరోవైపు రానున్న వర్షాకాలం దృష్ట్యా బ్యారేజీల పరిస్థితిపై రాష్ట్రస్థాయి డ్యాం సేఫ్టీ బృందం రంగంలోకి దిగింది. దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీతో పాటు సాంకేతిక, ఇంజినీరింగ్ నిపుణుల‌ు ఉన్నారు. ముందుగా వీరు అన్నారం బ్యారేజ్ వద్దకు చేరుకుని, 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీని పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.

మేడిగడ్డలో గేట్లు ఎత్తే సాధ్యసాధ్యాలను విశ్లేషించారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల ఎగువ, దిగువ ప్రాంతాలను, నీటి ప్రవాహన్ని(Water Flow) పరిశీలించారు. బ్యారేజీలు పూర్తిగా ఖాళీ కావడంతో ఇసుక మేటలు వేయగా పరిస్థితిని అంచనా వేశారు. రెండు బ్యారేజీల పరిస్థితులను వారు ఫొటోలు, వీడియో తీసుకున్నారు. వీరి నివేదిక అనంతరం జాతీయ డ్యాం సేఫ్టీ అథారిట్ బృందం మరో మారు బ్యారేజీని పరిశీలించనున్నారు.

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్​ రెడ్డి

Last Updated : Feb 23, 2024, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details