ETV Bharat / state

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాల సోదాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 2:59 PM IST

Updated : Jan 9, 2024, 10:28 PM IST

Vigilance and Enforcement Teams Search on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాలు తనిఖీలు చేశాయి. సాగు నీటి కార్యాలయాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు కీలక దస్త్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారు.

Vigilance and Enforcement Teams Search on Kaleshwaram Project
Kaleshwaram Project

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాల సోదాలు

Vigilance and Enforcement Teams Search on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జ్యూడీషియల్​ విచారణకు సర్కార్​ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారుల విస్తృత సోదాలు చర్చనీయాంశమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage), కన్నేపల్లి పంప్​ హౌస్​లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. మహాదేవపూర్​ సాగునీటి శాఖ డివిజన్​ కార్యాలయం, కన్నేపల్లి పంప్​ హౌస్​ కార్యాలయాల్లో రికార్డులను, విలువైన పత్రాలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్​లోని ఎర్రమంజిల్​ ఉన్న​ జలసౌధ, కరీంనగర్​ ఎల్ఎండీలోని ఇరిగేషన్ కార్యాలయంలో కాళేశ్వరం కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో పోలీసు, విజిలెన్స్​కు చెందిన మొత్తం పది ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.

ఉదయం 9 గంటల నుంచి మహదేవపూర్​, కన్నేపల్లి పంప్​ హౌజ్​ కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్​లోని ఎర్రమంజిల్​ జలసౌధలో ఉన్న కాళేశ్వరం(Kaleshwaram) కార్పొరేషన్​ కార్యాలయంలో విజిలెన్స్​ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్​ డిజైన్​, ఆర్గనైజేషన్​, క్వాలిటీ కంట్రోల్​ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్​ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో విజిలెన్స్​ తనిఖీలు నిర్వహించింది.

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

LMD Project Vigilance Enquiry : ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ(LMD)లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టింది.తాళాలు వేసి ఉన్న కార్యాలయాన్ని తెరిపించిన అధికారులు అందులో రికార్డులను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్‌ ఎస్పీ రమణారెడ్డితో పాటు ఇద్దరు సీఐల బృందం ఫైళ్లను తనిఖీ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఫేజ్‌-2కు సంబంధించి ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు గల పనులకు సంబంధించిన పనులను నీటిపారుదల శాఖ అధికారులు ఇక్కడి నుంచి పర్యవేక్షించే వారు. అయితే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక ఇక్కడి నుంచి కార్యాలయాన్ని రామగుండానికి తరలించారు.అడపా దడపా అధికారులు ఇక్కడికి వస్తుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు కార్యాలయ గేట్లను మూసివేసి ఫైళ్లను తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి : కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమీక్షల్లో బిజీగా మారింది. గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో బ్యారేజీ భవిష్యత్తునే ప్రశ్నార్ధకంగా మారింది. గత నెల 29న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి(Uttam Kumar Reddy) నేతృత్వంలో మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించి, కాళేశ్వరాన్ని అక్రమాల పుట్టగా అభివర్ణించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణకు ఆదేశించేందుకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో విజిలెన్స్​ తనిఖీలు కలకలం రేపుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు కష్టమేనంటున్న ఇంజినీరింగ్ అధికారులు

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తాం : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Last Updated :Jan 9, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.