తెలంగాణ

telangana

సౌత్​లో ఆ ఇద్దరు తెలుగు హీరోలే నా ఫేవరెట్: షమీ

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 7:14 PM IST

Updated : Feb 20, 2024, 7:10 AM IST

Shami Favorite Hero: టీమ్ఇండియా ప్లేయర్ షమీ సౌత్ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోలు ఎవరో చెప్పాడు.

Shami Favorite Hero
Shami Favorite Hero

Shami Favorite Hero:టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోమవారం హైదరాబాద్​లో సందడి చేశాడు. ఓ హెయిర్ ప్లాంటేషన్ సెంటర్​ ప్రారంభించేందుకు హైదరాబాద్ వచ్చిన షమీ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. హైదరాబాద్​తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా షమీ చెప్పాడు. ఈ క్రమంలో సౌత్​లో తనకు నచ్చిన హీరో ఎవరని అడగ్గా జూనియర్ ఎన్​టీఆర్, ప్రభాస్ అని షమీ టక్కున జవాబిచ్చాడు.

'సౌత్​ సినిమాలు బాగుంటాయి. తెలుగు, తమిళం అర్థం కావు. డబ్బింగ్ మూవీస్ చుస్తాను. సౌత్​లో జూనియర్, ప్రభాస్ అంటే ఇష్టం. మ్యాచ్​లు ఆడుతున్నప్పుడు కూడా సినిమాల గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇక్కడకు వచ్చినా తప్పకుండా బిర్యానీ టేస్ట్ చేస్తా' అని షమీ అన్నాడు. ఫిట్​నెస్ సమస్యలతో జట్టుకు దూరంగా ఉంటున్న షమీ 2024 మార్చిలో ప్రారంభమయ్యే ఐపీఎల్​లో రిలో దిగే ఛాన్స్ ఉంది.

Shami World Cup 2023: షమీ 2023 ప్రపంచకప్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అతడు మెగాటోర్నీలో ఏడు మ్యాచ్​ల్లో 24 వికెట్లతో సత్తా చాటాడు. అందులో ఏకంగా మూడుసార్లు 5 వికెట్లు, ఒకసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక సెమీస్​లో న్యూడిలాండ్​తో జరిగిన మ్యాచ్​లోనైతే బీభత్సం సృష్టించాడు షమీ. ఈ మ్యాచ్​లో షమీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి, టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వన్డేల్లో ఒక మ్యాచ్​లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్​గా నిలిచాడు షమీ.

Shami Arjuna Award:కేంద్ర ప్రభుత్వం రీసెంట్​గా షమీకి 'అర్జునా అవార్డు' ప్రకటించింది. 2024 జనవరి 9న దిల్లీ రాష్ట్రపతి భవన్​లో ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఇక క్రికెటర్లలో సచిన్ తెందూల్కర్ (1994), అనిల్ కుంబ్లే (1995), సౌరభ్ గంగూలీ (1997), రాహుల్ ద్రవిడ్ (1998), లక్ష్మణ్ (2001), వీరేంద్ర సేహ్వాగ్ (2002), గౌతమ్ గంభీర్ (2009), జహీర్ ఖాన్ (2011), యువరాజ్ సింగ్ (2012), అంజింక్యా రహానే (2016), ఛెతేశ్వర్ పుజారా (2017), రవీంద్ర జడేజా (2019), శిఖర్ ధావన్ (2021) అర్జునా అవార్డు అందుకున్నారు.

అన్నకు తగ్గ తమ్ముడు - రంజీలో రాణిస్తున్న షమీ సోదరుడు

100% కష్టపడ్డాం- ఏం తప్పు చేశామో ఇప్పటికీ తెలియట్లేదు: షమీ

Last Updated : Feb 20, 2024, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details