తెలంగాణ

telangana

భారత్​ x ఇంగ్లాండ్ టెస్ట్​ - ఈ డెబ్యూ ప్లేయర్లకే కాదు మనకూ మోస్ట్ మెమోరబులే! - Memorable Test For Debut Players

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 4:02 PM IST

Memorable Test Series For Debut Players : ఐపీఎల్​ సందడి ప్రారంభమయ్యేకి ముందు క్రికెట్ లవర్స్​ను ఎంతో ఉర్రూతలూగించింది భారత్, ఇంగ్లాండ్ టెస్ట్. అయితే ఈ మ్యాచ్​తో టెస్ట్​లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత మంది తమ ఆటతీరుతో అదరగొట్టి మెమెరబుల్ ఇన్నింగ్స్ ఇచ్చారు. ఇంతకీ వారెవరంటే ?

Memorable Test Series For Debut Players
Memorable Test Series For Debut Players

Memorable Test Series For Debut Players : ఏ క్రీడలోనైనా ఆటగానికి తమ కెరీర్ తొలి మ్యాచ్ అనేది చాలా కీలకం. చాలా సందర్భాల్లో తమ తొలి మ్యాచ్​లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారి క్రీడా భవిష్యత్తు ఆదారపడుతుంది. ఇక క్రికెట్ విషయానికస్తే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదా ఇక అంతే సంగతులు. ఇదిలా ఉండగా ఐపీఎల్​కు ముందు జరిగిన భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్​లో ఐదుగురు యువ ఆటగాళ్లు తమ టెస్ట్ కెరీర్​ను ప్రారంభించారు. అంతే కాదండోయ్ వారి ఆరంగ్రేటం మ్యాచ్​లో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. వారి వివరాలు తెలుసుకోవాలనుందా ఈ స్టోరీ చదవండి.

  1. ధ్రువ్ జురేల్
    ఈ వికెట్ కీపర్ కమ్​ బ్యాట్స్ మెన్ తన ప్రారంభ మ్యాచ్ రాజ్ కోట్​లో ఆడాడు. తొలి ఇన్నింగ్స్​లో 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాంచీలో జరగిన నాలుగో టెస్ట్ లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్​ను 90 పరుగులు చేసి 307 పరుగులు గౌరవప్రద స్కోర్​కు చేర్చాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్​లో 39 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
  2. సర్ఫరాజ్ ఖాన్
    యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రాజ్ కోట్​లో ఆడిన తన తొలి మ్యాచ్ లో 66 బంతుల్లో 62 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో ఇన్నింగ్స్​ లోనూ 68 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
  3. ఆకాశ్​ దీప్
    టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్​ బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ పేస్ తన బౌలర్ ఆరంగ్రేట మ్యాచ్​లోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బెన్ డకేట్ , ఒల్లి పోప్, జాక్ క్రౌలీ లాంటి స్టార్​ ప్లేయర్ల వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
  4. టామ్ హర్ట్లీ
    ఇంగ్లాండ్ తరపున హైదరాబాద్​ వేదికగా జరిగిన తొలి మ్యాచ్​తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన టామ్, తొలి మ్యాచ్​లోనే తొమ్మిది వికెట్లు నేలకూర్చాడు. నాలుగు మ్యాచుల్లో 20 వికెట్లు స్వాధీనం చేసుకున్నాడు. అంతే కాకుండా 159 పరుగులు కూడా స్కోర్ చేశాడు.
  5. షోయబ్ బషీర్
    ఇంగ్లాండ్ తరఫున తన టెస్ట్ డెబ్యూ ఇచ్చిన చేసిన షోయబ్, వీసా సమస్యతో తన తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు. అయితే రాంచీ వేదికగా జరిగిన పోరులో తొలి ఇన్నింగ్స్​లోనే 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. షోయబ్ మెుత్తంగా ఈ మ్యాచ్​లో ఎనిమిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details