ETV Bharat / sports

రోహిత్ చెప్పిన ఒక్క మాటతో సర్ఫరాజ్​ సేఫ్- లేకుంటే ప్రమాదమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 7:48 PM IST

Updated : Mar 9, 2024, 8:00 PM IST

Rohit Sharma Saves Sarfaraz Khan
Rohit Sharma Saves Sarfaraz Khan

Rohit Sharma Saves Sarfaraz Khan: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్​ సర్ఫరాజ్ ఖాన్​కు ధర్మశాల టెస్టులో ప్రమాదం తప్పింది. కెప్టెన్ రోహిత్ సలహా వల్లే సర్ఫరాజ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Rohit Sharma Saves Sarfaraz Khan: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సలహా వల్ల యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్​కు ప్రమాదం తప్పింది. ధర్మశాల టెస్టు మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ షోయబ్ బషీర్ బ్యాటింగ్ చేస్తుండగా, సర్ఫరాజ్ షార్ట్​ లెగ్​ (Short Leg)లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. కుల్​దీప్ యాదవ్ వేసిన బంతిని బషీర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్​ను తాకిన బంతి వేగంగా వచ్చి షార్ట్​ లెగ్​లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్​ తలకు తగిలింది. అయితే ఆ సమయంలో సర్ఫరాజ్ హెల్మెట్ ధరించి ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఇది చూసిన నెటిజన్లు రోహిత్ సలహా కారణంగానే సర్ఫరాజ్​కు ప్రమాదం తప్పిందని అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో సర్ఫరాజ్ హెల్మెట్ లేకుండా సిల్లీ పాయింట్​(Silly Point)లో ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అది గమనించిన రోహిత్ వెంటనే 'ఓయ్, హీరో నహీ బన్​నే, హెల్మెట్ పేన్' (హీరో అవ్వడం అవసరం లేదు. హెల్మెట్ పెట్టుకో) అని అన్నాడు. వెంటనే సర్ఫరాజ్ ఆ మ్యాచ్​లో కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. ఈ మాటలు అక్కడే ఉన్న స్టంప్స్​ మైక్రోఫోన్​లో రికార్డయ్యాయి. దీంతో ఆటలో సాహసాలు చేయడం మానేసి ముందు సేఫ్టీ చూసుకోవాలని రోహిత్ సూచించడం తన కెప్టెన్సీ లక్షణాల్లో ఒకటని నెటిజన్లు అప్పడు ప్రశంసించారు. ఇక తాజా సంఘటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. హీరో అయ్యే అవసరం లేదని రోహిత్ భాయ్ అప్పుడే చెప్పాడని కామెంట్ సెక్షన్​లో గుర్తుచేస్తున్నారు.

ఇక మ్యాచ్​ విషయానికొస్తే, భారత్ 64 పరుగులు, ఇన్నింగ్స్​ తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 218 పరుగుకు ఆలౌట్ కాగా, టీమ్ఇండియా 477 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్​లో భారత్​కు 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 195 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్​లో సర్ఫరాజ్ ధనాధన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. అతడు 60 బంతుల్లో 56 పరుగులు బాదాడు. అందులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

సర్ఫరాజ్​పై మాజీ బ్యాటర్ ఫైర్ ​- 'ఆ చెత్త షాట్‌ ఇప్పుడు అవసరమా?'

అవన్నీ ఫేక్- మీ టాలెంట్​నే నమ్మకోండి: సర్ఫరాజ్ తండ్రి

Last Updated :Mar 9, 2024, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.