తెలంగాణ

telangana

'ఒక్క రోజు కామెంట్రీకి రూ.25 లక్షలు' - ఆసక్తికరంగా సిద్ధూ వ్యాఖ్యలు

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 10:58 PM IST

IPL Commentators Remuneration : భారత మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వూలో ఐపీఎల్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఇంతకీ అదేంటంటే ?

IPL Commentators Remuneration
IPL Commentators Remuneration

IPL Commentators Remuneration :క్రికెట్‌ మ్యాచ్‌లకు ముఖ్యంగా ఐపీఎల్ హైవోల్టేజ్‌ గేమ్‌లకు అభిమానుల హోరు, కామెంటరీ మ్యూజిక్‌ లాంటివి. మ్యాచ్‌పై ఉత్కంఠను, ఆసక్తిని పెంచే సత్తా కామెంటరీకి ఉంటుంది. అయితే దాదాపు దశాబ్ద కాలం సుదీర్ఘ విరామం తర్వాత, మాజీ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రికెట్ కామెంటరీకి తిరిగి రానున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సిద్ధూ హ్యాస్యం కలిసిన కామెంటరీని క్రికెట్‌ అభిమానులు ఎంజాయ్‌ చేయనున్నారు. ఎంటర్‌టైనింగ్‌ కామెంటరీ స్టైల్‌ని కామెంటరీ బాక్స్‌కి తీసుకురానున్నాడు. ఐపీఎల్​ అఫిషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్‌కి అందించిన ఒక ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడాడు. తన జర్నీ, రెమ్యునరేషన్‌, టీ20 వరల్డ్‌ కప్‌ వంటి చాలా అంశాలపై తన అభిప్రాయాలు షేర్‌ చేసుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్ జట్టులను నిర్ణయించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషిస్తుందని సిద్ధూ అభిప్రాయపడ్డాడు. కేవలం భారత్‌ మాత్రమే కాదని ఇతర దేశాలు కూడా ఐపీఎల్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తాయని పేర్కొన్నాడు. జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ మొదలవుతుందని, ఐపీఎల్​ పాల్గొనే ఆటగాళ్లు సత్తా చాటి, నేషనల్‌ టీమ్స్‌లో చోటు దక్కించుకోవచ్చని చెప్పాడు.

ఆ ఇద్దరూ ప్రత్యేకం
టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వెటరన్ ప్లేయర్స్‌ కీలకం. క్రికెట్‌లో వారి ఎక్స్‌పీరియన్స్‌, క్లాస్‌ ప్రత్యేకం. ఇద్దరూ 2022 ఎడిషన్ నుంచి పెద్దగా టీ20లు ఆడకపోయినా, వారి నైపుణ్యం భారత జట్టుకు విలువైన ఆస్తిగా మారుతుందని సిద్ధూ అభిప్రాయపడ్డాడు. వారికి మూడు ఫార్మాట్‌లకు అనుగుణంగా ఆడే సత్తా ఉందని తెలిపాడు.

ఇటీవల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలవడంపై కూడా స్పందించాడు. ఒక్క ఓటమితో అన్ని విజయాలను తక్కువ చేయలేమని, వరల్డ్‌ కప్‌లో ఇండియా అద్భుతంగా రాణించిందని తెలిపాడు. జట్టు భవిష్యత్తు అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాడు. ప్రతిభను పెంపొందించే, ఆటగాళ్లు రాణించేందుకు పుష్కలమైన అవకాశాలను కల్పించే అనుకూలమైన క్రికెట్ వ్యవస్థే భారత్ విజయానికి కారణమని పేర్కొన్నాడు.

" నేను క్రికెట్ ఆడిన కాలంలో, రీప్లేస్‌మెంట్‌లు లేనందున ఫామ్‌లో లేకపోయినా కొనసాగేవారు. ఇప్పుడు హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఎందుకంటే అతను చాలా బాగా ఆడాడు. ఇది రోహిత్‌కు అవమానం కాదు. ఇది కేవలం ఆలోచనా ప్రక్రియ. పాత క్రమం కొత్తదానికి మారాలి" అని చెప్పాడు.

ఆ విషయంలో నాకు నమ్మకం లేదు!
జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమరే ముందుకు నడిపించిందా? అనే ప్రశ్నకు..‘నా జీవిత రహస్యం ఏంటంటే నేను స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అవుతాను. రాజకీయాల నుంచి స్విచ్ ఆఫ్ కావడం నాకు చాలా కష్టమైంది. మానసిక దృఢత్వం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నడిపిస్తుంది. క్రికెట్‌లో నేను 20 సార్లు పునరాగమనం చేశాను. కామెంటరీకి మొదటిసారి తిరిగొస్తున్నాను. 1999 నుంచి 2014-15 వరకు కామెంటరీలో దూసుకెళ్లాను.

"నేను క్రికెట్‌ను విడిచిపెట్టి కామెంటరీలో చేరాను. ఇది నేను చేయగలనా అని నాకు తెలియదు. నేను ప్రారంభంలో నమ్మకంగా లేను. కానీ ప్రపంచ కప్‌లో 10-15 రోజులు, సిద్ధూయిజం అనే పదం వచ్చింది. నేను ఓ మార్గంలో నడుస్తాను. అందులో ఎవరూ నడవడం లేదు. అది సిద్ధూయిజం ప్రత్యేకం. మొత్తం టోర్నీకి రూ.60-70 లక్షల తీసుకునే రోజుల నుంచి, ఇప్పుడు ఐపీఎల్లో ఒక్క రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నాను. డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. చేసే పనిలో సంతృప్తి ఉండాలి." అని సిద్ధూ పేర్కొన్నాడు.

వికెట్ కీపింగ్​కు దూరం - రాహుల్ స్థానంలో ఎవరు రానున్నారంటే ?

ధోనీ టు రైనా - ఐపీఎల్​లో సిక్సర్ల వీరులు వీరే!

ABOUT THE AUTHOR

...view details