తెలంగాణ

telangana

UAEకి రెండో విడత మ్యాచ్​లు షిఫ్ట్ - క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 9:12 PM IST

Updated : Mar 16, 2024, 10:37 PM IST

IPL 2024 Second Phase Matches Venue : సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్​ లీగ్‌ రెండో విడత మ్యాచ్​లను యూఏఈలో నిర్వహించనున్నారన్న వార్తలపై ఐపీఎల్​ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు.

IPL 2024 Venue
IPL 2024 Venue

IPL 2024 Second Phase Matches Venue : సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్​ లీగ్‌ రెండో విడత మ్యాచ్​లను యూఏఈలో నిర్వహించనున్నారన్న వార్తలపై ఐపీఎల్​ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. అందులో నిజం లేదంటూ తోసిపుచ్చారు. వేదికలో ఎటువంటి మార్పులు లేదని త్వరలోనే మిగతా షెడ్యూల్​ను కూడా విడుదల చేస్తామని తెలిపారు. అయితే గతంలోనూ బీసీసీఐ 2009, 2014 ఎన్నికల సమయంలో టోర్నీని సౌతాఫ్రితా, దుబాయ్​లో నిర్వహించింది. కానీ, 2019లో మాత్రం పూర్తి టోర్నీనీ విజయవంతంగా భారత్​లోనే నిర్వహించింది.

మరోవైపు ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా స్పందించారు. రెండో దశ మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. "ఈ ఏడాది సీజన్‌ మొత్తం ఇండియాలోనే జరగనుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదు" అంటూ ఆయన పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే తొలి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఈ ప్రతిష్టాత్మక లీగ్ ప్రారంభం కానుంది. అప్పటి నుంచి ఏప్రిల్ 7వరకు ఐపీఎల్ 17న సీజన్ తొలి విడత టోర్నీ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్​లు ఉన్నాయి.

ఏయే మ్యాచ్​లు ఎప్పుడంటే?

  • మార్చి 22: చెన్నై X బెంగళూరు (చెన్నై)
  • మార్చి 23: పంజాబ్‌ X దిల్లీ (మొహాలీ)
  • మార్చి 23: కోల్‌కతా X హైదరాబాద్‌ (కోల్‌కతా)
  • మార్చి 24: రాజస్థాన్ X లఖ్‌నవూ (జైపుర్)
  • మార్చి 24: గుజరాత్‌ X ముంబయి (అహ్మదాబాద్‌)
  • మార్చి 25: బెంగళూరు X పంజాబ్ (బెంగళూరు)
  • మార్చి 26: చెన్నై X గుజరాత్‌ (చెన్నై)
  • మార్చి 27: హైదరాబాద్‌ X ముంబయి (హైదరాబాద్‌)
  • మార్చి 28: రాజస్థాన్‌ X దిల్లీ (జైపుర్)
  • మార్చి 29: బెంగళూరు X కోల్‌కతా (బెంగళూరు)
  • మార్చి 30: లఖ్‌నవూ X పంజాబ్‌ (లఖ్‌నవూ)
  • మార్చి 31: గుజరాత్ X హైదరాబాద్ (అహ్మదాబాద్‌)
  • మార్చి 31: దిల్లీ X చెన్నై (వైజాగ్‌)
  • ఏప్రిల్ 01: ముంబయి X రాజస్థాన్‌ (ముంబయి)
  • ఏప్రిల్ 02: బెంగళూరు X లఖ్‌నవూ (బెంగళూరు)
  • ఏప్రిల్ 03: దిల్లీ X కోల్‌కతా (వైజాగ్‌)
  • ఏప్రిల్ 04: గుజరాత్ X పంజాబ్ (అహ్మదాబాద్‌)
  • ఏప్రిల్ 05: హైదరాబాద్‌ X చెన్నై (హైదరాబాద్‌)
  • ఏప్రిల్‌ 6: రాజస్థాన్‌ X బెంగళూరు (జైపుర్)
  • ఏప్రిల్ 7: ముంబయి X దిల్లీ (ముంబయి)
  • ఏప్రిల్ 7: లఖ్‌నవూ X గుజరాత్ (లఖ్‌నవూ)

లాస్ట్ సీజన్​ మిస్​- నయా జోష్​తో రీ ఎంట్రీ- 2024లో కమ్​బ్యాక్​ పక్కా!

IPL 2024 అందరి కళ్లు అతడిపైనే - దిల్లీ క్యాపిటల్స్ బలాబలాలు ఇవే

Last Updated : Mar 16, 2024, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details