తెలంగాణ

telangana

జులై 14 సీఎం రేవంత్‌రెడ్డికి డెడ్‌ లైన్‌ : ఎంపీ అర్వింద్‌ - MP Arvind on Cm Revanth

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 1:42 PM IST

MP Arvind about CM Revanth Case : జులై 14న సీఎం రేవంత్​కు ఓటుకు నోటు కేసు డెడ్​లైన్​ అని బీజేపీ ఎంపీ అర్వింద్​ అన్నారు. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్తారని కాంగ్రెస్​ నేతలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పలు చోట్ల బీజేపీ ఎంపీ అభ్యర్థులు అర్వింద్, డీకే అరుణ సీఎం రేవంత్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

MP Arvind on CM Revanth Cash for Vote case
MP Arvind about CM Revanth Case

ఓటుకు నోటు కేసులో జులై 14 రేవంత్‌రెడ్డికి డెడ్‌లైన్‌ : ఎంపీ అర్వింద్‌

MP Arvind on CM Revanth Cash for Vote case : ఓటుకు నోటుకు కేసులో జులై 14న సీఎం రేవంత్​రెడ్డికి డెడ్​ లైన్​ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. ఈ కేసులో రేవంత్​ ఎప్పుడు జైలుకు వెళ్తారని కాంగ్రెస్​ నేతలు ఆనందంతో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత అబద్ధమో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలు కూడా అంతే అబద్ధమని విమర్శించారు. ఇవాళ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఐలాపూర్, మల్లాపూర్​లలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రజలకు కాస్తయినా సంక్షేమ పథకాలను అందించారని, మరిన్ని పథకాలను అందిస్తానని అబద్ధపు మాటలు చెప్పి కుండలను పెట్టి బిందెలను ఎత్తుకెళ్లారని అర్వింద్ విమర్శించారు. కానీ రేవంత్​ ఆ కుండలను కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ ప్రచారానికి వెళ్లినప్పుడు ఆరు గ్యారెంటీల గురించి ​ప్రజలు నిలదీస్తున్నారని, అందుకే గుడ్డు వ్యవహారాన్ని తెచ్చారని ధ్వజమెత్తారు.

DK Aruna Comments on Revanth : గత ఎన్నికల్లో తనను జైపాల్​రెడ్డి ఓడించడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు సీఎం రేవంత్​రెడ్డి ప్రయత్నిస్తున్నారని మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో కూడా తెలియని వాళ్లు పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్టంగా ఉన్నప్పుడు కొడంగల్​లో రేవంత్​రెడ్డి టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచినా ఏం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.

సోనియా గాంధీ పుట్టిన రోజున ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయల పథకాన్ని అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్, ​డిసెంబర్ 9న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని కూడా చెప్పి మోసం చేశారని డీకే అరుణ ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఉచిత బస్సు పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీతోపాటు రోడ్​ షోలో ఆమె పాల్గొన్నారు.

'జులై 14కు రేవంత్​కు డెడ్​లైన్​. కాంగ్రెసోళ్లు పండుగ చేసుకుంటున్నారట జులై 14న ఎప్పుడు వస్తది, ఎప్పడు జైలుకు వెళ్తారు రేవంత్​రెడ్డి అని. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేసేది లేదు. వాళ్లు చెబుతోందంతా అబద్ధం. మీరెవరూ భయటపడకండ్రి.'- ధర్మపురి అర్వింద్‌, బీజేపీ ఎంపీ

ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి సీఎం రేవంత్‌ గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నారు : అర్వింద్‌ - MP Arvind on CM Revanth

ABOUT THE AUTHOR

...view details