తెలంగాణ

telangana

రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తా : కోమటిరెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 9:50 PM IST

Minister Komatireddy Fire on Kishan Reddy : రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సొంతనియోజకవర్గానికి ఏం చేయలేదని విమర్శించారు. ఐదేండ్ల నుంచి బీఆర్ఎస్​ నేతలు రాష్ట్రంలో రోడ్లను మరిచిపోయారని విమర్శించారు.

Minister Komatireddy Fire on Kishan Reddy
Minister Komatireddy Comments

Minister Komatireddy Fire on Kishan Reddy :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ కిషన్ రెడ్డి మాట్లాడటం సరికాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ను టచ్ చేస్తే బీజేపీను(BJP) నామరూపాలు లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చడం పోరాటాల గడ్డ తెలంగాణలో సాధ్యం కాదన్నారు.

ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రమంత్రిగా తెలంగాణకు ఒక్క పైసా తీసుకురాలేని కిషన్ రెడ్డి, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల(Parliament Election) కోసం బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పెట్టుకుంటున్నాయని రాష్ట్ర ఆర్అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమికి దూరంగా ఉన్న కేసీఆర్, బీజేపీతో అవగాహన ఒప్పందం కోసమే త్వరలో దిల్లీ వెళ్లనున్నారని మంత్రి పేర్కొన్నారు.

"నాలుగేళ్లు వేల కోట్ల బడ్జెట్​ తన తగ్గరే పెట్టుకొని, కనీసం రూ.200 కోట్లను కూడా సొంత రాష్ట్రానికి తెచ్చుకోలేని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఆ పార్టీ మీటింగ్​లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని ప్రచారం చేస్తుండటం సరికాదు. మీరు వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో ప్రభుత్వాలను కూల్చినట్లుగా, ఈ పోరాటాల గడ్డ తెలంగాణలో మీ చర్యలు జరగవు. కాంగ్రెస్ పార్టీని టచ్​ చేసినా సరే, బీజేపీని నామ రూపాలు లేకుండా చేస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం. ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారో?"- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

Komati Reddy Venkat Reddy Comments on BRS :రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మెదక్​లో కేసీఆర్ గెలిచి చూపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్​సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నింటికీ కేటీఆర్​ను(KTR) ముందు పెట్టి, మాజీ మంత్రి హరీశ్​రావును డమ్మీ చేశారన్న మంత్రి, ఇప్పుడు మేడిగడ్డ కూలిపోగానే హరీశ్​రావును ముందు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

కేఆర్ఎంబీ, సాగునీటి ప్రాజెక్టులపై కేటీఆర్, హరీశ్​రావుకు ఏమీ తెలియదన్నారు. సూపర్ గేమ్ చేంజర్, రీజనల్​ రింగ్​ రోడ్డు​ను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆర్ఆర్ఆర్(RRR) మంజూరై నాలుగేళ్లయినా కేసీఆర్ అమసర్థత వల్ల ముందుకు సాగలేదని, కేంద్రం నుంచి నిధులు రాలేదన్నారు. ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటామని, ప్రధానిని కూడా కలుస్తామని మంత్రి తెలిపారు.

రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీను నామరూపాల్లేకుండా చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

సినీ పరిశ్రమలోని నిరుపేద కార్మికులకు నానక్​రాంగూడలో ఇళ్ల నిర్మాణం : మంత్రి కోమటిరెడ్డి

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details