తెలంగాణ

telangana

'కృష్ణాజలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు - నల్గొండలో సభ ఎలా పెట్టనివ్వరో చూస్తాం'

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 9:13 AM IST

KCR Public Meeting in Nalgonda : కృష్ణాజలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఉద్యమమని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ బహిరంగ సభకు అన్ని మండలాల నుంచి ప్రాతినిథ్యం ఉండేలా దృష్టి సారించాలని, గ్రామాల్లో చర్చించేందుకు వీలుగా యువత ఎక్కువగా తరలివచ్చేలా చూడాలని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారని, హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారన్నారు.

KCR Meeting on Krishna River Water
KCR Public Meeting in Nalgonda

ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రమపడక్కర్లేదు- వాళ్లే కొట్టుకుంటున్నారు కేసీఆర్

KCR Public Meeting in Nalgonda: కృష్ణా నదీ పరివాహక ప్రాంత నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫలితాలు, మార్పులను ఆయన సమావేశంలో ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చామని సాగు నీరు, విద్యుత్‌తో పాటు రైతు సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని తెచ్చామని వివరించారు.

నన్ను, నా పార్టీని టచ్​ చేయడం ఎవరికీ సాధ్యం కాదు : కేసీఆర్

KCRMeeting on Krishna River Water : నదీ జలాల విషయంలో రాజీలేని పోరాటం చేశామని, కేంద్రానికి ఎక్కడా తలొగ్గలేదని కేసీఆర్(KCR Comments) తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందో, లేదోనన్న ఆయన, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. విషయంపై దృష్టి సారించకుండా దూషిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. పాలన చేతకాక తనపై కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు.

BRS Nalgonda BRS Public Meeting : నల్గొండ సభ అడ్డుకుంటాననేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరని కేసీఆర్ప్రశ్నించారు. సభను అడ్డుకునేది ఎవరని, ఎట్ల పెట్టుకోనివ్వరో చూద్దామని అన్నారు. నల్గొండ సభ కోసం వెంటనే దరఖాస్తు చేయాలని నేతలను ఆదేశించారు. అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ(BRS Nalgonda Public Meeting) జిల్లా నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని నేతలకు స్పష్టం చేశారు. 12 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. మిగిలిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి మండలం నుంచి సభకు ప్రాతినిథ్యం ఉండాలని సూచించారు. వీలైనంత వరకు సభకు యువత వచ్చేలా చూడాలని, వారి ద్వారా గ్రామాల్లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ సభ కంటే ముందే నియోజకవర్గ, మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ - మూణ్నెళ్ల తర్వాత తెలంగాణ భవన్​కు కేసీఆర్

KCR on Congress Guarantees: అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు కొట్లాడతారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వేదికగా పార్టీ పోరాడుతుందని కేసీఆర్ తెలిపారు. పార్టీ నేతలు తొందరపడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదో తేదీన అమలు చేస్తామన్న రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, రైతు భరోసా(Rythu Bharosa), విద్యుత్ బిల్లులు లాంటి వాటి గురించి ప్రశ్నిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చెప్పారు. ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చారని కేసీఆర్ ఆరోపించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది : నిరంజన్​ రెడ్డి

KCR Comments on Revanth Reddy : ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అమలు చేయడంతో పాటు హామీల అమలు ఆషామాషీ వ్యవహారం కాబోదని కేసీఆర్పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని, మార్పును ప్రజలే గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమకు ఎలాంటి తొందరలేదని, ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గడ్డపారలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారని వ్యాఖ్యానించారు. వెయ్యి శాతం బీఆర్​ఎస్​ తిరిగి అధికారంలోకి వస్తుందని కేసీఆర్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడాన్ని ఖండించడానికే ఛలో నల్గొండ సభ : కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details