తెలంగాణ

telangana

భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి - Lok Sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 7:51 PM IST

Congress MLA Rajgopal Reddy Fires on KCR : భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ఆయన, కేసీఆర్ పాలనలో అవినీతికి పాల్పడి రూ.వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

Congress Leaders Election Campaign
Congress MLA Rajgopal Reddy Fires on KCR

Congress MLA Rajgopal Reddy Fires on KCR :భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పని అయిపోయిందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామ్యూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మోదీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగం మార్చే కుట్ర జరుగుతుందని అన్నారు.

కేసీఆర్‌ విద్యుత్‌ వ్యవస్థను అల్లకల్లోలం చేసి - ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు : భట్టి - DY CM Batti Vikramarka Fires On KCR

Congress Leaders Election Campaign :తుంగతుర్తి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన వెనుక దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని కార్యకర్తలకు ధైర్యం నింపారు. తెలంగాణలో కారు పని అయిపోయిందని కారుకు పంచర్, రిపేరు కాదు తుప్పు పట్టి తూకానికి అమ్మకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇక భవిష్యత్​కు కారుకు డ్రైవర్ లేరని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీని ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీగా మార్చారో అప్పుడే తెలంగాణకు, కేసీఆర్​కు పేగుబంధం తెగిపోయిందని చెప్పారు. రాబోయే 20ఏళ్లు కాంగ్రెస పార్టీ పాలనలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పట్టణాల్లో తప్ప పల్లెల్లో లేదని తెలిపారు. కేసీఆర్ 12మంది ఎమ్మెల్యేలను తీసుకుని రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని విమర్శించారు. అవినీతిగా సంపాదించుకున్న సొమ్మునంతా కక్కిస్తామన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు రేవంత్ సైన్యం సిద్ధం - వాటికి ఆధారాలతో కూడిన కౌంటర్ - LOK SABHA ELECTIONS 2024

బీఆర్ఎస్ పార్టీలో చివరికి తండ్రి కుమారుడు మాత్రమే ఉంటారని, హరీశ్ రావు కూడా ఉండడని జోస్యం చెప్పారు. తాము తలచుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అవుతుందని హెచ్చరించారు. కవిత తీహాడ్ జైలుకి వెళుతుందని తాను అప్పుడే చెప్పినట్లు గుర్తుచేశారు. లోక్​సభ ఎన్నికల్లో తమకు ఎవ్వరూ పోటీ లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కులస్థుడైనా, మతస్థుడైనా ఒక్కటే అన్న ఆయన బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lok Sabha Polls 2024 : ఎడారిగా మారిన తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత వారందరిపై ఉందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్​ను గద్దె దింపుతామని చెప్పి వారికి అధికారం రాకుండా చేశామని కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉద్యమ కాలంలో సెంటిమెంట్​ను ఉపయోగించుకుని విద్యార్థుల ప్రాణాలను తీసి అధికారంలోకి వచేచిన కేసీఆర్ వచ్చి వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

గ్రౌండ్​ లెవెల్​లో బీజేపీ పట్టు కోల్పోయింది : మంత్రి కొండా సురేఖ - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details