తెలంగాణ

telangana

హామీల అమలుపై పరాభవానికి ఇప్పటి నుంచే సిద్ధం కండి : నిరంజన్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 3:27 PM IST

Updated : Feb 23, 2024, 8:24 PM IST

Ex Minister Niranjan Reddy fires on CM Revanth : సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తులను కించపరిచే విధానాన్ని మానుకోవాలని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఆ పార్టీలో మీరు ఎంత కాలం ఉంటారో దేవుడికే తెలియాలన్నారు.

Niranjan Reddy Comments on CM Revanth
Ex Minister Niranjan Reddy fires on CM Revanth

హమీల అమలుపై పరాభవానికి ఇప్పటి నుంచే సిద్ధం కండి : నిరంజన్‌రెడ్డి

Ex Minister Niranjan Reddy fires on CM Revanth : రేవంత్‌రెడ్డి, సీఎం అయ్యాక బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) మండిపడ్డారు. నిన్న కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) మాట్లాడిన తీరు బాగోలేదని, ఆయన తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు. ఆ మాటలకు ప్రతిగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాలమూరు జిల్లాలో సాగునీరు కేసీఆర్ ఇవ్వలేదు అంటూ అబద్ధాలు చెప్తున్నారని, కానీ పాలమూరులో నీళ్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బటన్ ఆఫ్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా? అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. వలసల జిల్లాగా పాలమూరును మార్చింది కాంగ్రెస్ కాదా? అని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఎన్నిమార్లు పార్లమెంట్‌లో తెలంగాణ హక్కుల గురించి మాట్లాడారని?, తెలంగాణ ఉద్యమం, అభివృద్దిలో రేవంత్‌రెడ్డి పాత్ర శూన్యమని దుయ్యబట్టారు. ఒక్క కొడంగల్‌తోనే ఆకాశం అంతా దిగివచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్(KCR) అనుమతులు తెచ్చిన కళాశాలలకే రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు.

Niranjan Reddy Comments on CM Revanth :కాంగ్రెస్ పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాకు గురైందని, హైదరాబాద్ రాష్ట్ర విలీనంతో పాలమూరు నోట్లో కాంగ్రెస్ పార్టీ(Congress) మన్ను పోసిందని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టులను దశాబ్దాలుగా పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలో మాత్రం జలాశయాల నిర్మాణం పూర్తి చేసిందన్నారు. కల్వకుర్తి కింద కేవలం 3.9 టీఎంసీల సామర్థ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం జలాశయాలు నిర్మించిందని, నిత్యం నిందాపూర్వకం తప్ప ఏమీ చేసేది లేదని ఎద్దేవా చేశారు.

సన్‌ఫ్లవర్‌ రైతులను ఆదుకోండని తుమ్మలకు హరీశ్‌ లేఖ - రేపటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం

అభివృద్ధిలో కేసీఆర్‌కు మించిన పని చేసి మొనగాడు అనిపించుకోవాలని, అంతేకానీ కేసీఆర్ పనితనాన్ని చిన్న బుచ్చితే పెద్దవారు కారని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేపదే వ్యక్తులను కించ పరిచే విధానాన్ని మానుకోవాలని, కేసీఆర్‌పై కోస్గి సభలో చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. ఇంకోమారు అలా అంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

మీ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఆ పార్టీలో మీరు ఎంత కాలం ఉంటారో దేవుడికే తెలియాలని, రాబోయే రోజుల్లో హస్తం నేతలకు ఘోరమైన పరాభవం తప్పదని, అందుకు ముందే సిద్దంకావాలని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు కనీసం రైతుబంధు కూడా ఇవ్వలేదని, మీరు ఇచ్చిన హామీల అమలు దేవుడితో కూడా సాధ్యం కాదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఎండిన, పండని పంటలకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో పావు వంతు కూడా సాగు కాలేదని, గత యాసంగి, ఈ యాసంగి సాగు లెక్కలు తీస్తే వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు.

"రేవంత్‌రెడ్డి, సీఎం అయ్యాక బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పదేపదే వ్యక్తులను కించ పరిచే విధానాన్ని మానుకోవాలి. కేసీఆర్‌పై కోస్గి సభలో చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి ఉపసంహరించుకోవాలి. హమీల అమలుపై పరాభవానికి ఇప్పటి నుంచే సిద్ధం కండి".- నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి

గత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని బేషజాలకు పోతున్నారు: నిరంజన్‌రెడ్డి

ఆత్మసాక్షి ఉంటే రాజీనామా చేయాలి - హరీశ్‌రావుకు జూపల్లి సవాల్

Last Updated :Feb 23, 2024, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details