తెలంగాణ

telangana

మే 1న బ్యాంకుల ద్వారా పింఛన్ పంపిణీ- ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు - Aasara Pension Through Banks

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 10:34 PM IST

Aasara Pension through banks: పింఛన్ పంపిణీ అంశంపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల పింఛన్లను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు లేని వారు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయాలని పేర్కొంది.

AP GOVERNMENT
Aasara Pension through banks

Aasara Pension through banks :మే 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ డబ్బు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్లు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్‌ ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని పేర్కొంది. మే 1 నుంచి 5 లోపు పింఛన్లు ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వం వెల్లడించింది.

99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP MANIFESTO 2024

పింఛను కోసం లబ్ధిదారులు ఆయా గ్రామాల్లోని సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఆయా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మే ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే పింఛను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ విధివిధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

Aasara Pension in AP :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశించిది. కానీ సీఎస్‌ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో పింఛను కోసం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు మృతి చెందారు. అధికార వైసీపీ మాత్రం వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.

ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మే నెల పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చెల్లి చీరపై అన్న​ సెటైర్లు - ​సంస్కారం ఉందా అంటూ జగన్​పై షర్మిల ఫైర్ - SHAMRILA COUNTER TO JAGAN COMMENTS

ఐదేళ్లుగా మాట్లాడకుండా వివేకాపై విద్వేషం ఎందుకు జగనన్నా? : సునీత - Sunitha on AP CM Jagan

ABOUT THE AUTHOR

...view details