తెలంగాణ

telangana

రేపు మరోసారి రాష్ట్రానికి అమిత్​ షా - మాధవీ లతకు మద్దతుగా హైదరాబాద్​లో రోడ్​ షో - Amit Shah Hyderabad Tour Schedule

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 7:17 PM IST

Amit Shah Hyderabad Tour : కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మరోమారు రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు హైదరాబాద్​లో రోడ్​ షోలో పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

Amit Shah Election Campaign in Hyderabad
Amit Shah Hyderabad Tour

Amit Shah Election Campaign in Hyderabad : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం రేపు హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా లాల్​దర్వాజకు చేరుకుంటారు. బీజేపీ హైదారాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొననున్నారు.

లాల్​దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్‌ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట పాటు ఈ రోడ్‌ షో సాగనుంది. రోడ్‌ షో ముగించుకుని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి 9:15 గంటల నుంచి 10:15 గంటల వరకు చేవెళ్ల, నాగర్​కర్నూల్‌, మహబూబ్​నగర్​ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటారు. నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు.

మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తాం : అమిత్‌షా - Amit Shah Siddipet Meeting

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి మోదీ పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహాసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు చేసిన సహాయాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించేలా పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం ముగించుకున్న తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు 10:30 గంటలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.

తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ ​షా

అమిత్ షా పూర్తి షెడ్యూల్ ఇదే

  • ప్రత్యేక విమానంలో రేపు రాత్రి 7.40 గంటలకు బేగంపేటకు రానున్న అమిత్‌ షా
  • బేగంపేట నుంచి లాల్‌ దర్వాజ వెళ్లనున్న కేంద్ర హోం మంత్రి
  • హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా అమిత్‌షా ప్రచారం
  • రేపు రాత్రి 8 నుంచి 9 వరకు రోడ్‌ షోలో పాల్గొననున్న అమిత్‌ షా
  • రోడ్‌ షో తర్వాత బీజేపీ నేతలతో సమావేశం కానున్న అమిత్‌ షా
  • సమావేశం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస

రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం : అమిత్‌షా

'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్​తో అమిత్ షా ఎక్స్​క్లూజివ్​ - lok sabha election 2024

ABOUT THE AUTHOR

...view details