తెలంగాణ

telangana

అలర్ట్ : రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదా? - అయితే మీకు షుగర్ ముప్పు - ఇలా చేయాల్సిందేనట! - health problems less sleep

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 4:31 PM IST

Less Sleep Side Effects : మనిషికి తిండి, నీళ్ల తర్వాత అత్యంత ముఖ్యమైనది నిద్ర. ఇది లోపిస్తే తొలినాళ్లలో అలసట మొదలు.. దీర్ఘకాలంలో ఎన్నో ప్రమాదకర రోగాలు వేధించే అవకాశం ఉంది. అందులో షుగర్ వ్యాధికూడా ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు!

Less Sleep
Less Sleep Side Effects (ETV Bharat)

Less Sleep Side Effects : మనిషి ఆరోగ్యంగా ఉండటానికి 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు. సరిపడా నిద్రలేకపోతే మాత్రం.. నిస్సత్తువ, ఒత్తిడి, చిరాకు, ఏకాగ్రత లోపించటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలంలో బరువు పెరగడంతోపాటు బీపీ, షుగర్​ కూడా ఎటాక్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమితో కలిగే జబ్బులు :

అధిక రక్తపోటు : దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అయితే, సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. రోజూ సరిగ్గా నిద్రపోక పోవడం కారణంగా రక్తపోటు పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల లాంగ్​ టైమ్​లో గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మధుమేహం : చాలా మంది నిద్రకు షుగర్‌ వ్యాధికి ఎటువంటి సంబంధం ఉండదని అనుకుంటారు. అయితే.. ప్రతిరోజూ తక్కువ సమయం నిద్రపోవడం వల్ల షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట. నిద్రలేమితో కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవని నిపుణులంటున్నారు. దీనివల్ల కణాల్లోకి గ్లూకోజు చేరుకోదు. దీంతో.. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయని ఏలూరుకు చెందిన ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (రిటైర్డ్‌) అశ్వినీ కుమార్‌ తెలిపారు.

2019లో "PLOS One" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రోజూ రాత్రి 5 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 26 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని 'చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌'లో పనిచేసే డాక్టర్‌ జింగాంగ్ లీ (Xingang Li) పాల్గొన్నారు. రాత్రి తక్కువసేపు నిద్రపోవడం వల్ల షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్​: పరగడుపున జ్యూసులు తాగుతున్నారా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! - Side Effects of Drinking Juices

బరువు పెరుగుతారు :
నిద్రలేమితో బాధపడేవారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా నిద్రలేకపోతే మెదడులో ఆకలిని నియంత్రించే హార్మోన్ల తీరు అస్తవ్యస్తమవుతుందట. దీనివల్ల ఎక్కువగా తింటారు. కొంతమంది రాత్రిపూటచిరుతిళ్లు తినేస్తుంటారు. అలాగే వీరు ఉదయాన్నే లేట్‌గా లేచి వ్యాయామం చేయకుండా ఉంటారు. ఇవన్నీ బరువు పెరిగేలా చేస్తాయని నిపుణులంటున్నారు.

మంచి నిద్రకోసం ఇలా చేయండి :

  • రాత్రి పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయండి.
  • కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి.
  • పడుకునే అరగంట ముందు టీవీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ వంటి వాటిని దూరం పెట్టండి.
  • అలాగే ఇంట్లో వాళ్లతో సరదాగా మాట్లాడండి.
  • నిద్రపోయే ముందు ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ మందులు వేసుకునేవారు మద్యం తాగకూడదు! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం! - Alcohol Side Effects

వేసవిలో స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ వేధిస్తున్నాయా ? ఈ టిప్స్‌ పాటిస్తే అంతా సెట్​! - Skincare Tips in Summer

ABOUT THE AUTHOR

...view details