తెలంగాణ

telangana

ఈజీగా బరువు తగ్గాలా? ఈ 'ఆయుర్వేద' కట్​లెట్స్​ తింటే చాలు!

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 3:52 PM IST

Ayurvedic Food Recipes For Weight Loss : బ‌రువు త‌గ్గ‌డానికి చాలా మంది నానా తంటాలు ప‌డ‌తుంటారు. కొంద‌రైతే ఏవేవో మందులు ఉప‌యోగిస్తుంటారు. కానీ ఓ ఆయుర్వేద వంట‌కంతో సుల‌భంగా బరువు త‌గ్గొచ్చు. అదెలా అంటే?

Ayurvedic Home Remedies For Weight Loss
Ayurvedic Home Remedies For Weight Loss

Ayurvedic Food Recipes For Weight Loss :ఊబ‌కాయం సమ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లుతోపాటు వివిధ కారణాలతో అనేక మంది బ‌రువు పెరుగుతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కొవ్వు త‌గ్గించుకునేందుకు ర‌కర‌కాల విధానాల్ని అనుస‌రిస్తున్నారు. ఏవేవో మందులు వాడేస్తున్నారు. కానీ స‌హ‌జ‌సిద్ధంగా ఓ ఆయుర్వేద ఆహార పదార్థం ద్వారా ఎవరైనా సరే బ‌రువు త‌గ్గొచ్చు. పైగా దీన్ని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి?

కావాల్సిన పదార్థాలు

  • క్వినోవా
  • రాజ్మా
  • రెడ్ క్యాప్సికమ్
  • స్వీట్ కార్న్
  • సొంఠి
  • ఉప్పు
  • మిరియాలు
  • పిప్పళ్లు

పథ్యాహారం తయారు చేసే విధానం

  • ముందుగా క్వినోవా, రాజ్మాను(ఒక పూట నానబెట్టిన తర్వాత) ఉడికించి పెట్టుకోవాలి
  • స్టవ్ వెలిగించి బాణలి పెట్టాలి
  • మూడు కప్పులు నీరు వేసి మరిగించాలి
  • ఆ తర్వాత అందులో ఉడికించిన క్వినోవా, రాజ్మా వేయాలి
  • మరో గిన్నెలో రెండు చెంచాల క్యాప్సికమ్ ముక్కలు వేయాలి
  • అదే గిన్నెలో గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేయాలి
  • నేతిలో వేయించి పొడి చేసుకున్న సొంఠి, పిప్పళ్లను వేసుకోవాలి
  • పావు చెంచా మిరియాలు వేసుకోవాలి
  • బాణలిలో ఉడికిన క్వినోవా, రాజ్మాను మిక్సీలో వేసి పేస్ట్​లా చేసుకోవాలి
  • క్వినోవా, రాజ్మా పేస్ట్​ను క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న గిన్నెలో వేయాలి
  • ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి(ఉప్పు కాస్త తక్కువే వాడాలి)
  • మొత్తాన్ని మిశ్రమంగా సిద్ధం చేసుకోవాలి
  • కాసేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని కట్​లెట్స్​లా తయారు చేసుకోవాలి
  • స్టవ్​ వెలిగి పెనం పెట్టాలి
  • పెనం వేడి అయ్యాక నూనె వేసి కట్​లెట్స్​ను వేయించుకోవాలి
  • అంతే బరువు తగ్గించే పథ్యాహారం రెడీ అయిపోయినట్లే!

బరువు తగ్గాలనుకునే వారు వీటిని బ్రేక్​ ఫాస్ట్ రూపంలో లేక సాయంత్రం స్నాక్స్​లా తినవచ్చని ఆయుర్వేద నిపుణులు గాయత్రీ దేవి తెలిపారు. వాటిని రోజూ ఏదో ఒక సమయంలో తింటే బరువు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఈ పథ్యాహారాన్ని తయారు చేసేందుకు వాడిన పదార్థాల్లో ఉన్న పోషక విలువలను కూడా వివరించారు. అవి ఆమె మాటల్లోనే.

"ఈ పథ్యాహారంలో వాడిన ముఖ్య పదార్థమైన క్వినోవా మన శరీరంలోని మెట‌బాలిజాన్నిపెంచి కొవ్వు క‌రిగిస్తుంది. ఇందులో పీచు ప‌దార్థం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల క్వినోవాను ఒక్క‌సారి తింటే చాలాసేపు వరకు ఆకలి వేయదు. మరో ముఖ్యపదార్థమైన రాజ్మా శ‌రీరానికి మంచి ప్రొటీన్ అందిస్తుంది. రెడ్ క్యాప్సిక‌మ్ బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఓ మంచి ప‌దార్థం. ఇందులో ఫైబ‌ర్, యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇక పిప్పళ్లు, మిరియాలు, సొంఠి బరువు తగ్గేందుకు సహకరించే పదార్థాలు. అందుకే వీటిన్నంటితో తయారు చేసిన పథ్యాహారం తిని బరువు తగ్గొచ్చు" అని నిపుణులు గాయత్రీ దేవి తెలిపారు.

జుట్టు రాలుతోందా? - రండి యోగా చేద్దాం!

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా? - ఈ వర్కౌట్ ట్రై చేశారంటే రిజల్ట్ పక్కా!

ABOUT THE AUTHOR

...view details