ETV Bharat / health

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా? - ఈ వర్కౌట్ ట్రై చేశారంటే రిజల్ట్ పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 8:33 AM IST

Updated : Feb 8, 2024, 8:52 AM IST

Best Weight Loss Workout : ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా రిజల్ట్ అంతంతమాత్రమేనా? అలాకాకుండా మేము చెప్పే ఈ వర్కౌట్ డైలీ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. అలాగే ఫిట్​గా తయారవుతారు. మరి, ఆ వర్కౌట్ ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

Jumping Lunges
Jumping Lunges

Best Weight Loss Workout : బరువు తగ్గడానికి జనాలు ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. మరికొందరు స్ట్రిక్ట్​గా వర్కవుట్స్ చేస్తుంటారు. అయినప్పటికీ తేడా కనిపించదు. ఎంత సిన్సియర్​గా చేస్తున్నా వెయిట్ తగ్గట్లేదని ఫీలవుతుంటారు. మీరు కూడా ఇలాంటి కండిషన్లో ఉంటే.. మీ కోసమే ఈ స్పెషల్ వర్కవుట్. దీనిపేరే.. జంపింగ్ లంజెస్(Jumping Lunges). మరి.. ఈ వర్కౌట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

జంపింగ్ లంజెస్ ఇలా చేయాలి..

ఇది ఒక డైనమిక్ వ్యాయామం. ఈ వర్కౌట్ బాడీలోని బహుళ కండరాలను గట్టి పడేలా చేస్తుంది. 30 నిమిషాలు జంపింగ్ లంజెస్ చేయడం వల్ల సగటున 180 నుంచి 240 కేలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి దీని ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చంటున్నారు వ్యాయామ నిపుణులు. మీ శక్తి స్థాయిలను బట్టి ఈ వర్కౌట్​ స్పీడ్​నెస్ పెంచుకోవడం, ఎక్కువసేపు చేయడం లాంటివి అలవాటు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

జంపింగ్ లంజెస్ పోజ్
జంపింగ్ లంజెస్ పోజ్

ముందుగా మీరు రెండు కాళ్ల మధ్య కాస్త గ్యాప్ ఉంచి నిటారుగా నిల్చొవాలి. ఆ తర్వాత కుడి కాలిని ముందుకు వంచి ఎడమ కాలును మోకాళ్ల మీద ఉండేట్లు చూసుకోవాలి.(అంటే లంజ్ పొజిషన్ ఉండేలా చూసుకోవాలి). ఆ తర్వాత కాస్త గాలిలోకి ఎగురుతూ జంప్ చేస్తూ పొజిషన్​ ఛేంజ్ చేయాలి. అంటే కుడి కాలు, ఎడమ కాలు మార్చుతుండాలన్నమాట. ఇలా మారూస్తూ లంజెస్ చేయాలి. మీ శక్తి మేరకు వీలైనంత స్పీడ్​గా చేయాలి.

ఇవి చేసే టైమ్​లో రెండు చేతులు ముందుకూ వెనక్కి కదుల్చుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గడంతోపాటు ఫిట్​నెస్ పొందుతారంటున్నారు నిపుణులు. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ వీపును ఎక్కువగా సాగదీయకూడదు. అలా చేస్తే వీపు దిగువన ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మోకాళ్లను సాఫ్ట్​గా ల్యాండ్ చేయాలి. లేదంటే కీళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

లంచ్​ బదులు ఈ సలాడ్​లు ట్రై చేస్తే - ఈజీగా బరువు తగ్గుతారు!

జంపింగ్ లంజెస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఈ వర్కౌట్ వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్సర్​సైజ్ చేసేటప్పుడు ఎగరడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఫలితంగా రక్తప్రసరణ పెరగడంతోపాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కండరాలు బలంగా మారి బాడీలో శక్తిని పెంచుతాయి. అదేవిధంగా బాడీ ఫుల్ యాక్టివ్​గా మారుతుంది.

వీళ్లు చేయకూడదు.. ఈ వర్కౌట్ కొందరు చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కీళ్ల సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. కొత్తగా ప్రారంభించే వారు నిపుణుడిని సంప్రదించిన తర్వాతే సాధన చేయడం ఉత్తమం.

హిప్​ ఫ్యాట్​ ఇబ్బంది పెడుతోందా? ఈ టిప్స్​తో వెన్నలా కరగడం పక్కా!

కండరాల బరువు పెంచుకోవాలనుకుంటున్నారా? వాటికి స్వస్తి పలికి ఈ పద్ధతులు ట్రై చేయండి!

Last Updated : Feb 8, 2024, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.