తెలంగాణ

telangana

ఫసక్​ - కలెక్షన్ కింగ్​ మోహన్ బాబు నోటి నుంచి అలా పుట్టింది!

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 11:40 AM IST

Mohan Babu Birthday : నేడు(మార్చి 19) కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మోదుగులపాలెం నుంచి మద్రాసు వరకు ఆయన నటన ప్రస్థానం ఎలా సాగింది? ఆయన లైఫ్​లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫసక్​ -  కలెక్షన్స్ కింగ్​ మోహన్ బాబు నోటి నుంచి అలా పుట్టింది!
ఫసక్​ - కలెక్షన్స్ కింగ్​ మోహన్ బాబు నోటి నుంచి అలా పుట్టింది!

Mohan Babu Birthday : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీల్ లైఫ్​లోనే కాదు రియల్ లైఫ్​లోనూ తన రూటే సపరేటు అని ఇప్పటికి ఎన్నోసార్లు నిరూపించారు. అప్పట్లో మోహన్ బాబు సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఉండాల్సిందే. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, నటనతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బ్రేక్ చేశారు. అందుకే మోహన్ బాబును నిర్మాతలు కలెక్షన్ కింగ్, ఫ్యాన్స్ డైలాగ్ కింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. వెండితెరపై విలన్​గా అడుగుపెట్టి, హీరోగానూ ఆకట్టుకున్నారు. అయితే నేడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం.

దొంగబండి ఎక్కి పారిపోయి బాత్రూంలో దాక్కొని - మోహన్ బాబు 1952 మార్చి 19 చిత్తూరు జిల్లా మోదుగులపాలెంలో జన్మించారు. తన తండ్రి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్.సినిమాల్లో నటించేందుకు నటీనటులు కావాలంటే పేపర్లో ఓ యాడ్ వచ్చింది. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో మోహన్ బాబుకు వాళ్ల నాన్నకు ఆ విషయాన్ని చెప్పారట. దీంతో ఆయన అప్పు చేసి వంద రూపాయలు ఇస్తే ఫొటో స్టూడియోకు వెళ్లి ఫొటోలు దిగి దరఖాస్తు చేసుకున్నారట. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అమ్మనాన్నలకు చెప్పకుండానే దొంగబండి ఎక్కి చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుకున్నారు. చెన్నై మోహన్ బాబుకు మద్రాసు కొత్త. అక్కడేవరూ తెలియదు. కానీ కొద్దిగా తమిళం వస్తుంది.అయినా కూడా భయంతో అక్కడ ఉండకుండా మళ్లీ రైలెక్కి వెనక్కి వచ్చేశారు. టిక్కెట్టు లేకుండా ట్రైన్ ఎక్కడంతో టీసీ వస్తే బాత్రూంలో దాక్కున్నానని చెప్పారు. అయినా కూడా టీసీ దొరకడంతో మధ్యలోనే దింపేశారట. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఇంటికి చేరుకున్నాని చెప్పారు మోహన్ బాబు. ఈ విషయాన్ని నాన్నతో చెబితే చితకబాదారని చెప్పుకొచ్చారు.

అలా స్ఫూర్తి చెంది - తాను నటుడిగా ఎదగాలన్న కోరికను సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి ఇన్ స్పెయిర్ అయినట్లు తెలిపారు మోహన్​ బాబు. రాజమకుటం సినిమాకోసం థియేటర్​కు నడుచుకుంటూ వెళ్లినట్లు చెప్పారు. అయితే సినిమాల్లో విలన్​గా నటించాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్​గా రూ. 140 జీతంతో ఓ స్కూల్ లో పనిచేశానని చెప్పుకొచ్చారు. అయితే తాను వేరే కులానికి చెందినవాడినని ఉద్యోగంలో నుంచి తీసివేశారట. ఈ విషయాన్ని మోహన్ బాబు వాళ్ల నాన్నకు చెప్పడంతో ఆయన తమకున్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. వెయ్యి ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయం చేయమంటారేంటీ అని ఎదురు ప్రశ్న అడిగితే తనను చితకబాదినట్లు గుర్తుచేసుకున్నారు.

ఫసక్ అలా పుట్టింది - ఇకపోతే మోహన్​ బాబు కెరీర్​లో ఫసక్ అనే పదం ఎంతలా ట్రెండ్ అయిందో తెలిసిన విషయమే. మీమ్స్​లో సినిమాల్లోనూ దానిని బాగానే ఉపయోగించారు. అయితే ఓ సందర్భంలో ఆ ఫసక్ అనే పదం ఎలా వచ్చిందో వివరించారు మోహన్ బాబు. తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఫసక్ అనే పదం తాను వాడినట్లు గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఈ పదం బాగా ట్రెండ్ అయ్యింది. అయితే దానికి తానేం బాధపడేలేదని ఫసక్ అనే పదం భారీగా పాపులర్ అయినందుకు ఆనందించానని, గర్వపడ్డానని తెలిపారు. కాగా, మోహన్ బాబు ప్రస్తుతం తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. ఈ దాదాపు రూ.100 కోట్ల బడ్డెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది.

DJ Tillu బోల్డ్​ రోల్​ - స్టేజ్​పైనే అనుపమ స్ట్రాంగ్ ఆన్సర్​

SSMB 29 రిలీజ్ డేట్ - జపాన్​లో మహేశ్​ సినిమాపై జక్కన్న అదిరిపోయే అప్డేట్​

ABOUT THE AUTHOR

...view details