తెలంగాణ

telangana

'ఆ స్టార్ హీరో రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్లిపోతా' - Priyamani

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 10:09 AM IST

ఆ స్టార్ హీరో పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లిపోతానని అంటోంది సీనియర్ నటి ప్రియమణి. పూర్తి వివరాలు స్టోరీలో.

'ఆ స్టార్ హీరో రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్లిపోతా'
'ఆ స్టార్ హీరో రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్లిపోతా'

Priyamani Sharukh Khan : హీరోయిన్ ప్రియమణి గురించి సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. అందం అభినయం కలబోసిన ముద్దుగుమ్మల్లో ఈమె ఒకరు. సుదీర్ఘ కాలంగా తన నటనతో ఆకట్టుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తోంది. సాదాసీదాగానే సినీ రంగం ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణిస్తోంది. ఆ మధ్య నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో సౌత్ కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ సందడి చేస్తోంది. ఫ్యామిలీ మెన్​ వెబ్​సిరీస్, జవాన్, ఆర్టికల్ 370 వంటి చిత్రాలతో మంచి హిట్లను అందుకుంది. తెలుగులోనూ రీసెంట్​గా భామాకలాపం అనే వెబ్ సిరీస్‌ సీక్వెల్​తో ఆకట్టుకుంది. ప్రస్తుతం థియేటర్లలో మైదాన్ సినిమాతో అలరిస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన మనసులోని మాటను బయట పెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్​పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది.

Priyamani Sharukh Khan Movies :బాద్​షాతో కలిసి పని చేసే అవకాశం రావాలేగానీ ఏదైనా వదిలేయడానికి సిద్ధం అని చెప్పింది. షారుక్‌తో మళ్లీ కలిసి నటించాలనుందని మనసులో మాట బయట పెట్టింది. ఒకవేళ షారుక్‌ నన్ను పిలిచి వచ్చేయ్‌ నాతో కలిసి పని చేయాలి అని అంటే వెంటనే వెళ్లిపోతాను. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వదిలేస్తాను. ఆయనతో కలిసి పని చేయడమే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యం అంటూ ఉత్సాహంగా చెప్పింది. కాగా, గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో 1 2 3 4 గెట్‌ ఆన్‌ ది డాన్స్‌ఫ్లోర్‌ సాంగ్​లో షారుక్‌తో కలిసి చిందులేసింది ప్రియమణి. ఆ తర్వాత జవాన్‌ సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది.

ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో ది ఫ్యామిలీమ్యాన్‌ 3 వెబ్‌సిరీస్​లో నటించనుంది. దీని చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంకా తమిళంలో క్వటేషన్ గ్యాంగ్, కన్నడంలో ఖైమారా అనే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇవి త్వరలోనే విడుదల కానున్నాయి.

'నేనుంటే టాలీవుడ్ స్టార్ హీరోస్​ను ఎవ్వరూ పట్టించుకోరు'​ - Priyamani on Star Heroes

పెళ్లికి ముందే గర్బవతి అయితే - సుహాస్ కొత్త సినిమా రివ్యూ - Sriranga Neethulu Review

ABOUT THE AUTHOR

...view details