తెలంగాణ

telangana

'ఫ్యాన్స్​కు రాజాసాబ్ VFX ట్రీట్- అంచనాలు మించి ఉంటుంది'

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 10:31 PM IST

Prabhas Raja Saab Update: ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజా సాబ్​ గురించి నిర్మాత విశ్వ ప్రసాద్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్​కు VFX ట్రీట్​గా ఉండిపోతుందని ఆయన అన్నారు.

Prabhas Raja Saab Update
Prabhas Raja Saab Update

Prabhas Raja Saab Update: 'సలార్' సక్సెస్ ప్రభాస్ కెరీర్​​కు మళ్లీ ఊపునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా కూడా 2024 మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రభాస్- మారుతి డైరెక్షన్​లో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ రాజాసాబ్​ గురించి కీలక విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రాజా సాబ్ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్స్ ట్రీట్​గా ఉండబోతుందని విశ్వ ప్రసాద్ అన్నారు. మూవీ ఔట్​పుట్ అద్భుతంగా రాబట్టేందుకు అత్యుత్తమ టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎడిటింగ్​​లో ఎక్కువగా VFX ఉపయోగించామని వాటిని చూసి ప్రేక్షకులు అబ్బురపడతారని అన్నారు. ఇక ఈ సినిమాతో ఆడియెన్స్​కు​ పవర్​ఫుల్ కంటెంట్ అదిస్తామని విశ్వ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో గాని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది.

రాజా సాబ్ కు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ కూడా దర్శకుడు మారుతీనే రాశారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రభాస్ ని చూడచ్చు అని ఇది ఒక రొమాంటిక్ హారర్ సినిమా అని కూడా మారుతీ సృష్టం చేశారు. మారుతీ, సంగీత దర్శకుడు తమన్ తో ఇదివరకే పనిచేయడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వేంకటేశ్వర రావు పని చేస్తున్నారు.

ఇక సలార్ పార్ట్- 2​ 2025 లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఇదివరకే ప్రకటించారు. దీంతో ఆ సినిమా రాజా సాబ్ తర్వాత వస్తుందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ADలో దీపికా పదుకొన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానితో పాటు ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

'ఇది కూడా ఓ అప్‌డేటేనా?' అని అంటున్నారు' - 'రాజా సాబ్' డైరెక్టర్ స్పీచ్​

'రాజాసాబ్', 'ఫ్యామిలీ స్టార్'​ రిలీజ్ డేట్స్ ​- మేకర్స్ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details