తెలంగాణ

telangana

ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్​ మీద నటి క్లారిటీ!

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 3:52 PM IST

Jabardasth Rohini Love Story : జబర్దస్త్ లేడీ కమెడియన్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిణి గురించి చాలా మంది తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. తాజాగా ఈమె తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టింది! ఓ టాప్ ప్రొడ్యూసర్​తో తాను ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు.

ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్​ మీద చిందులేస్తూ నటి క్లారిటీ!
ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్​ మీద చిందులేస్తూ నటి క్లారిటీ!

Jabardasth Rohini Love Story : జబర్దస్త్ కామెడీ షోతో మస్త్​ క్రేజ్ సంపాధించుకున్న వారిలో రోహిణి కూడా ఒకటి. తన కామెడీ టైమింగ్​తో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె తక్కువ కాలంలోనే టీమ్ లీడర్​గానూ ఎదిగింది. సినిమాలు, వెబ్ సిరీస్​లు కూడా చేస్తూ తన టాలెంట్​ను ప్రూవ్ చేసుకుంటోంది. రీసెంట్​గా సేవ్ ది టైగర్స్, హనుమాన్ చిత్రంలోనూ కనిపించి ఆకట్టుకుంది.

ఇప్పుడీమె గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమాలోనూ నటించింది. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ ప్రమోషన్స్​లో జోరుగా పాల్గొంటోంది. ఇందులో భాగంగానే సుమ అడ్డా షోకు ఈ టీమ్​ గెస్ట్​లుగా విచ్చేసి సందడి చేసింది.

గోపీచంద్​తో పాటు హీరోయిన్స్​ ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, కమెడియన్​ రోహిణి, ఈ సినిమా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ షోలో పాల్గొన్నారు. అయితే షోలో భాగంగా సుమ - ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉందంటూ చెప్పింది. అయితే పక్కనే ఉన్న రోహిణి కూడా తనను కూడా అడగాలని చెబుతుంది. సరే నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని సుమ తిరిగి అడగగా రాధామోహన్ మొహం వైపు చూస్తూ ఉన్నారని సిగ్గుతో చెప్పింది రోహిణి.

ఆ తర్వాత తనకోసం కాలేజీ, స్కూల్ రోజుల్లో రాధామోహన్ తన వెంట పడి తిరిగే వారంటూ సరదాగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆయనతో కలిసి ఓ పాత పాటకు చిందులు కూడా వేసింది. అలా కేకే రాధామోహన్ తన లవర్ అన్నట్లుగా షోలో నవ్వులు పూయించింది. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

కాగా, భీమా సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, నాజర్, నరేశ్, పూర్ణ, రఘుబాబు, చమ్మక్ చంద్ర వంటి వాళ్లు కూడా ఇతర పాత్రల్లో కనిపించారు. మరి ఈ సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్​కు ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో చూడాలి.

ఈ స్టార్స్ వెడ్డింగ్స్ చాలా కాస్ట్లీ - వేల కోట్లలోనే పెళ్లి ఖర్చులు

ఓ ఊపు ఊపేసిన జాన్వీ - అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో డ్యాన్స్ హంగామా!

ABOUT THE AUTHOR

...view details