తెలంగాణ

telangana

'అవన్నీ ఫేక్ వార్తలు'- ఆరోగ్యంపై అమితాబ్ క్లారిటీ

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 2:59 PM IST

Updated : Mar 16, 2024, 2:52 PM IST

Amitabh Bachchan: తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు.

Amitabh Bachchan Hospitalised
Amitabh Bachchan Hospitalised

Amitabh Bachchan:బాలీవుడ్ స్టార్ హీరో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. అవన్నీ ఫేక్ వార్తలని ఆయన స్పష్టం చేశారు. అయితే అమితాబ్ అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని, ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కానీ, తాజాగా ఆయన ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌కు హాజరై సందడి చేశారు. అక్కడ 'మీ ఆరోగ్యం ఎలా ఉంది?' అని మీడియా అడగ్గా 'బాగున్నాను, నా అనారోగ్యంపై వస్తున్న వార్తలు ఫేక్' అని రిప్లై ఇచ్చారు. దీంతో అమితాబ్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఫైనల్​కు​ హాజరైన ఆయన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో కలిసి మ్యాచ్‌ చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

ఇక అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్​తో కలిసి 'కల్కి 2898' ఏడీ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్​మోడ్​లో ఉంది. అయితే గతంలోనూ ఇదే సినిమా షూటింగ్​లో అమితాబ్ గాయాలపాలయ్యారు. ఆయనపైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డారు. అయితే మూవీ టీమ్ హుటాహుటిన బిగ్​బీని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన కోలుకుని తిరిగి షూటింగ్​కు వచ్చారు.

ఆ రూమర్స్​కు చెక్​
మరోవైపు కల్కి సినిమా షూటింగ్‌ గురించి అమితాబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. మూవీ గురించి నెట్టింట వచ్చిన రూమర్స్​కు ఆయన ఆ పోస్ట్​తో చెక్​ పెట్టారు. దీంతో పాటు రిలీజ్ డేట్​పై క్లారిటీ ఇచ్చారు.

"కల్కి షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైంది. ఈ సినిమా షూటింగ్​ పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా చెప్పినట్లుగానే ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు ఎంతోమంది కష్టపడి పని చేస్తున్నారు" అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది.

ఇక కల్కి సినిమాలో అమితాబ్​తో పాటు ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకుణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహా నటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్​, స్పెషల్ పోస్టర్లు ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

విడుదలైన 19 ఏళ్లకు ఓటీటీలో - అమితాబ్​ 'బ్లాక్' మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే ?

నేషనల్ అవార్డులు - అత్యధిక సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న నటుడెవరంటే ?

Last Updated : Mar 16, 2024, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details