తెలంగాణ

telangana

సెబీలో 'అసిస్టెంట్ మేనేజర్' పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:29 AM IST

SEBI Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. సెబీ 97 గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SEBI Recruitment 2024 for 97 Assistant Manager posts
SEBI Recruitment 2024

SEBI Recruitment 2024 : సెక్యూరిటీస్​ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 97 గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • జనరల్​ - 62 పోస్టులు
  • లీగల్ - 5 పోస్టులు
  • ఐటీ - 24 పోస్టులు
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 2 పోస్టులు
  • రీసెర్చ్​ - 2 పోస్టులు
  • అఫీషియల్ లాంగ్వేజ్​ - 2 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 97

విద్యార్హతలు
SEBI Assistant Manager Job Qualification :అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ చూడండి.

వయోపరిమతి
SEBI Assistant Manager Job Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 మార్చి 31 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లు లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SEBI Assistant Manager Job Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000+ 18% జీఎస్టీ చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా కట్టాలి.

ఎంపిక ప్రక్రియ
SEBI Assistant Manager Selection Process :అభ్యర్థులకు రెండు దశల్లో ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన వారిని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
SEBI Assistant Manager Salary :సెబీ అసిస్టెంట్ మేనేజర్​లకు రూ.44,500 నుంచి రూ.89,150 వరకు జీతం ఉంటుంది. దీనికి తోడు ఎన్​పీఎస్​, గ్రేడ్ అలవెన్స్​, స్పెషల్ అలవెన్స్​, డియర్​నెస్ అలవెన్స్​, ఫ్యామిలీ అలవెన్స్​, లోకల్ అలవెన్స్, లెర్నింగ్ అలవెన్స్​, స్పెషల్ గ్రేడ్ అలవెన్స్ కూడా అందిస్తారు.

దరఖాస్తు విధానం
SEBI Assistant Manager Application Process :

  • అభ్యర్థులు ముందుగా సెబీ అధికారిక వెబ్​సైట్ https://www.sebi.gov.in/ ఓపెన్ చేయాలి.
  • One Time Registration లింక్​పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన అన్ని వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
  • దీనితో మీకొక రిజిస్ట్రేషన్ నంబర్​, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఈ రిజిస్ట్రేషన్ నంబర్​, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్​ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • వెంటనే మీకొక యూనిక్​ నంబర్​ జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

SEBI Recruitment 2024 Application Start Date :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్​ 13

ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో EPFOలో 323 పర్సనల్ అసిస్టెంట్​ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details