తెలంగాణ

telangana

ఉక్కపోతతో అల్లాడిపోతున్నారా? - మీ వెంట ఈ 'పాకెట్ ఏసీ' ఉంటే రోజంతా కూల్​ కూల్! - Sony Wearable Air Conditioner

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 1:45 PM IST

Reon Pocket 5 Air Conditioner : రోజురోజుకి ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటకముందే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో అందరూ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆశ్రయిస్తుంటారు. ఇవన్నీ ఇంట్లో ఉన్నంత వరకు మాత్రమే. అలాకాకుండా.. ఎక్కడికెళ్లినా మీ వెంట వచ్చే ఏసీ కూడా ఉందని మీకు తెలుసా?

WEARABLE AIR CONDITIONER
Reon Pocket 5 Air Conditioner (ETV Bharat)

Sony Launches Reon Pocket 5 Air Conditioner :సమ్మర్​లోవేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అయితే, అవి ఎంత ఖరీదైనవైనా గదిలో ఉన్నంత వరకే ఉపశమనం అందిస్తాయి. ఒక్కసారి బయటికి వచ్చామా ఉక్కపోతతో అల్లాడిపోవాల్సిందే. ఇలాంటి సమయంలోనే ఎక్కడికి వెళ్లినా మనతో పాటు వచ్చే AC ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది! మరి మీరు అనుకున్నది నిజమైతే.. అవును, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ(Sony)సరికొత్త డివైజ్​ను రూపొందించింది. ఈ పరికరం మీతో ఉంటే ఏసీ(Air Conditioner) కూడా మీ వెంటే వస్తుంది. అదెలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..

ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనీ కంపెనీ.. ఇటీవల మరో కొత్త స్మార్ట్ గ్యాడ్జెట్​ను విడుదల చేసింది. అదేంటంటే.. మీరు ధరించగలిగే చిన్న ఏసీ(Wearable Air Conditioner)ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ పరికరాన్ని మెడపై తగిలించుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా వేసవిలో ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ డివైజ్ చలికాలంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నయా స్మార్ట్ గ్యాడ్జెట్​ను రియాన్​ పాకెట్-5(Reon Pocket 5) పేరిట మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది సోనీ.

మొదటిసారిగా AC కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - AC Buying Guide

ఈ డివైజ్ ఎలా పనిచేస్తుందంటే?సోనీ తీసుకొచ్చిన రియాన్ పాకెట్ 5 పోర్టబుల్ ఏసీ డివైజ్​ను ఆన్​ చేయగానే.. అది మన బాడీ, పరిసరాల టెంపరేచర్​ను సరిపోలుస్తుంది. ఆటోమేటిక్​గా అదే కూలింగ్ లేదా వార్మింగ్ ఉష్ణోగ్రతను సెట్ చేస్తుంది. అంటే.. దీనిని మనం ప్రత్యేకంగా కంట్రోల్​ చేయాల్సిన అవసరం లేదు. మన కదలికలకు బట్టి అక్కడి పరిసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను ఛేంజ్ చేస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు మొబైల్‌ యాప్‌లో ప్రత్యేకంగా కమాండ్స్‌ ఇచ్చే ఫీచర్‌ కూడా ఉంది.

ఆన్‌/ఆఫ్‌ చేయాల్సిన అవసరం లేదు! : ఇంకా చెప్పాలంటే మీరు ఈ డివైజ్‌ను ప్రత్యేకంగా ఆన్‌/ఆఫ్‌ చేయాల్సిన అవసరం లేదు. దీనిని మెడపై పెట్టుకోగానే ఆటోమేటిక్​గా పనిచేయడం ప్రారంభిస్తుంది. తీసి పక్కనపెడితే పనిచేయడం ఆగిపోతుంది. ఈ రియాన్‌ పాకెట్‌ -5 ఏసీ డివైజ్​లో ఉష్ణోగ్రత, తేమ, కదలికలను పసిగట్టడం కోసం మొత్తం ఐదు సెన్సర్లు ఉంటాయి. దీనితో పాటు ఒక పాకెట్‌ ట్యాగ్‌ను కూడా ఇస్తారు. దాన్ని ముందు జేబులో వేసుకుంటే సరిపోతుంది. అది పరిసరాల్లో ఉష్ణోగ్రతను గుర్తించి రియాన్‌ పాకెట్‌కు చేరవేస్తుంది. అయితే, ట్యాగ్‌ లేకున్నా ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుందని సోనీ కంపెనీ తెలిపింది. ఈ ట్యాగ్ అనేది కేవలం ఉష్ణోగ్రతను మరింత కచ్చితత్వంతో అంచనా వేయడానికి మాత్రమే సహాయపడుతుందని వెల్లడించింది.

ఈ డివైజ్‌ బ్యాటరీ లైఫ్‌ విషయానికొస్తే.. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 17 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ధర విషయానికొస్తే.. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ. 14,186. అయితే, ఈ స్మార్ట్​ డివైజ్.. ప్రస్తుతానికి భారత్‌లో అందుబాటులో లేదు. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది సోనీ కంపెనీ. వాస్తవానికి.. దీన్ని సోనీ 2019లోనే తీసుకొచ్చింది. క్రమంగా అప్‌డేటెడ్‌ వెర్షన్లను రిలీజ్ చేస్తోంది. అయితే, తీసుకొచ్చిన ప్రతిసారీ కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తోంది. తాజాగా రియాన్‌ పాకెట్‌-5ను ఐరోపాలో విడుదల చేసింది సోనీ.

Sony Liv​ అదిరిపోయే ప్లాన్స్​ - ఓటీటీ లవర్స్ స్పెషల్ ​-​ ప్రీమియం ప్యాక్​పై భారీ ఆఫర్​!

ABOUT THE AUTHOR

...view details