తెలంగాణ

telangana

షార్ట్ టర్మ్​ ఎఫ్​డీ Vs లాంగ్​ టర్మ్​ ఎఫ్​డీ - ఏది బెస్ట్ ఛాయిస్​?

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 3:40 PM IST

Short Term FD Vs Long Term FD : మీరు ఫిక్స్​డ్ డిపాజిట్​ చేయాలనుకుంటున్నారా? షార్ట్​ టర్మ్ ఎఫ్​​డీ చేయాలా? లేదా లాంగ్ టర్మ్ ఎఫ్​డీ చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే! ఫిక్స్​డ్​ డిపాజిట్ టెన్యూర్​ను ఎలా ఎంచుకోవాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

how to choose right fixed deposit tenure
Short Term FD vs Long Term FD

Short Term FD Vs Long Term FD : ఫిక్స్​డ్ డిపాజిట్స్ అనేవి చాలా సురక్షితమైనవి. వీటివల్ల ఖాతాదారులకు మంచి వడ్డీ రావడంతో పాటు, వారి డబ్బుకు రక్షణ లభిస్తుంది. అందుకే మన దేశంలో వీటికి ఆదరణ ఎక్కువ. సాధారణంగా ఫిక్స్​డ్ డిపాజిట్ల కాలపరిమితి కొన్ని రోజుల నుంచి మెుదలుకొని కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఎక్కువ కాలానికి చేసే ఎఫ్​డీలపై అధిక శాతం వడ్డీ వస్తుంది. స్వల్ప కాలానికి చేసే ఎఫ్​డీలపై తక్కువ వడ్డీ వస్తుంది. అయితే ఆర్థిక అత్యవసరం ఏర్పడినప్పుడు షార్ట్ టర్మ్ ఎఫ్​డీల నుంచి డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది. కానీ లాంగ్ టర్మ్​ ఎఫ్​డీల నుంచి సొమ్ము తీసుకోలేము. అందుకే మన ఆర్థిక అవసరాలు తీరేందుకు ఫిక్స్​డ్ డిపాజిట్లు ఎంత కాలానికి చేయాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరాలకు అనుగుణంగా
మీరు ఫిక్స్​డ్ డిపాజిట్ చేసే ముందు మీ ఆర్థిక అవసరాలను ఒకసారి అంచనా వేసుకోవాలి. ఒకవేళ మీకు సమీప భవిష్యత్​లోనే డబ్బు అవసరం ఉంటే, షార్ట్ టర్మ్ ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఇప్పట్లో డబ్బు అవసరం లేదు అనుకుంటే లాంగ్ టర్మ్ ఎఫ్​డీలు చేయాలి. ఎందుకంటే దీర్ఘకాలిక ఫిక్స్​డ్ డిపాజిట్లపై బ్యాంకులు అధిక వడ్డీని చెల్లిస్తాయి.

వడ్డీ రేట్లు
సాధారణంగా ఎఫ్​డీలపై అందించే వడ్డీ రేట్లు కాలపరిమితిని అనుసరించి మారుతూ ఉంటాయి. అలాగే వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలైన వడ్డీ రేట్లు ఉంటాయి. కనుక ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఏ బ్యాంకులు అధికంగా వడ్డీ ఇస్తున్నాయో చూసుకొని, వాటిలో ఎఫ్​డీ చేయటం మంచిది.

పన్ను మినహాయింపులు
ఎఫ్​డీల వచ్చే వడ్డీపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కనుక మీకు వచ్చే రాబడి తగ్గుతుంది. అందుకే మీ పాలసీ కాలవ్యవధి ఆధారంగా ట్యాక్స్ ఎంత కట్ అవుతుందో ముందే తెలుసుకోండి. లేదా టాక్స్​-సేవర్ ఎఫ్​డీల్లో పొదుపు చేయండి.

ద్రవ్యోల్బణం ప్రభావం
సాధారణంగా దీర్ఘకాల ఫిక్స్​డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుంది. అయితే ఈ రాబడి ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ద్రవ్యోల్బణ రేటు కంటే ఎఫ్​డీ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే, తిరిగి మీరే నష్టపోతారు. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ల్యాడరింగ్ స్ట్రాటజీ
మీ దగ్గర ఉన్న సొమ్మును ఒకే ఫిక్స్​డ్ డిపాజిట్​లో కాకుండా, వివిధ కాలపరిమితిలు గల ఎఫ్​డీలలో ఇన్వెస్ట్ చేయాలి. దీనినే ల్యాడరింగ్ స్ట్రాటజీ (నిచ్చెన వ్యూహం) అంటారు. దీని వల్ల మీకు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో వచ్చే ఆర్థిక అవసరాలు అన్నీ తీరుతాయి. ముఖ్యంగా మీ డబ్బు ఒకే దగ్గర లాక్ అయిపోకుండా ఉంటుంది. పైగా వడ్డీ కూడా బాగా కలిసి వస్తుంది.

ఫిక్స్​డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్ లేని ప్రక్రియ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఎఫ్​డీలు చేయటం వల్ల, మీ డబ్బు సురక్షితంగా ఉండటంతోపాటు, మంచి రిటర్న్స్ పొందవచ్చు అని వారు సూచిస్తున్నారు.

2024లో లాంఛ్​ కానున్న టాప్​-10 ఈవీ కార్స్ ఇవే! వీటి రేంజ్ ఎంతంటే?

టికెట్​ బుకింగ్​కు ఈమెయిల్​, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్​!- IRCTC కొత్త అప్డేట్

ABOUT THE AUTHOR

...view details