ETV Bharat / business

టికెట్​ బుకింగ్​కు ఈమెయిల్​, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్​!- IRCTC కొత్త అప్డేట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 8:59 PM IST

IRCTC New Rules For Ticket Booking
IRCTC New Rules For Ticket Booking

IRCTC New Rules For Ticket Booking : దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే రవాణా వ్యవస్థ రైల్వే. చాలా మంది ఆన్‌లైన్‌లో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక వెబ్​సైట్​ ఐఆర్‌సీటీసీను అప్డేట్ చేసి కొత్త గైడ్​లైన్స్​ను రూపొందించింది. ఆ వివరాలు మీకోసం.

IRCTC New Rules For Ticket Booking : సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ఉత్తమ రవాణా మార్గం రైల్వే. ఎందుకంటే బస్సు, విమానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో రైలులో ప్రయాణించవచ్చు. అందుకే చాలా మంది ఆన్‌లైన్‌లో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక వెబ్​సైట్​ ఐఆర్‌సీటీసీను అప్డేట్​ చేసింది. అవేంటంటే?

ప్రయాణికులు రైలు టికెట్‌లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్‌ చేసుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈ-మెయిల్​ను ధ్రువీకరించాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ ఇలా

  • మొదటగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో వెరిఫికేషన్‌ విండోకు లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి.
  • హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్‌ని ధ్రువీకరించాలి.
  • ఇక ఈ-మెయిల్ వెరిఫికేషన్‌ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయాలి.
  • ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ రైలు టికెట్​ బుకింగ్‌లు చేయగలుగుతారు.

ఆర్​ఏసీ ప్యాసింజర్లకు ప్రత్యేక బెడ్​ రోల్​
Bed Roll Kit For RAC Passengers In AC Trains : రైల్వే ఏసీ కంపార్ట్​మెంట్లలో ప్రయాణించే ఆర్​ఏసీ ప్యాసింజర్ల విషయంలో కొన్నాళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్​ రైల్వే. ఆర్​ఏసీ టికెట్​ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్​ రోల్​ కిట్​ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్​ చెప్పారు. ఈ కిట్​లో ఒక బెడ్​షీట్​, దుప్పటి, టవల్​తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్​ కార్​ ప్రయాణికులకు వర్తించదని ఆయన చెప్పారు.

ఈ బెడ్​ రోల్​ కిట్​కు సంబంధించిన ఛార్జీలను ఆర్​ఏసీ ప్రయాణికులు బుక్​ చేసుకునే టికెట్​ రుసుములోనే చెల్లిస్తున్నారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలతో కూడిన ఓ లేఖను ఇప్పటికే అన్నీ జోన్​ల జనరల్​ మేనేజర్లకు పంపినట్లు శైలేంద్ర సింగ్​ తెలిపారు. ప్రతి ఆర్​ఏసీ( Reservation Against Cancellation ) ప్రయాణికుడికి ఈ సదుపాయం అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన అన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

రైలు​ హారన్లు 11 రకాలని మీకు తెలుసా? వాటి అర్థాలు తెలిస్తే షాకే!

రైల్లో హాఫ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు - మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.