తెలంగాణ

telangana

'2024లో భారత్​ జీడీపీ వృద్ధి రేటు 6.8%' - మూడీస్​

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 12:43 PM IST

Updated : Mar 4, 2024, 1:10 PM IST

India GDP Growth Rate 2024 : ఈ 2024వ సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం వరకు పెరుగుతుందని మూడీఎస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. 2025 నాటికి ఈ జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతానికి చేరుతుందని పేర్కొంది.

Moody raises India GDP growth rate
India GDP Growth Rate 2024

India GDP Growth Rate 2024 : అంతర్జాతీయ రేటింగ్ సంస్థ 'మూడీస్​ ఇన్వెస్టర్స్ సర్వీస్​' 2024లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 6.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు 2025లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.

అత్యంత వేగంగా అభివృద్ధి!
జీ20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కొనసాగుతుందని మూడీస్ పేర్కొంది. వినియోగదారలు ధరల సూచిక (సీపీఐ) అంచనాలను కూడా మూడీస్ విడుదల చేసింది. వస్తు, సేవల కోసం వినియోగదారులు చెల్లించే ధరలలో సగటు మార్పు విషయానికి వస్తే, 2024లో సీపీఐ 5.2 శాతంగా ఉంటుందని, 2025లో ఇది 4.8 శాతానికి చేరుతుందని పేర్కొంది.

వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరికొన్ని నెలలపాటు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని మూడీఎస్ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తరువాత మాత్రమే వడ్డీ రేట్ల విషయంలో మార్పులు, చేర్పులు చేయవచ్చని అభిప్రాయపడింది.

మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల తరువాత ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం కూడా మౌలిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించవచ్చని మూడీఎస్​ తెలిపింది.

'దేశంలో మౌలిక, నిర్మాణ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. జీఎస్టీ వసూళ్లు, వాహనాల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా దేశ ఆర్థిక వృద్ధి మునుపటి కంటే ఇప్పుడు వేగంగా జరుగుతోంది' అని మూడీస్​ వివరించింది.

'ప్రైవేట్ పారిశ్రామిక మూలధన వ్యయం పెద్దగా జరగకపోయినప్పటికీ, సప్లై చైన్​ డైవర్సిఫికేషన్​ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలు కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ దేశాన్ని వృద్ధి పథంలోకి నడిపిస్తున్నాయి' అని మూడీఎస్​ విశ్లేషించింది.

వృద్ధి పథంలో
గత వారం, కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీ డేటాను విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 8.4 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. వాస్తవానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంటుందని చాలా మంది నిపుణులు అంచనా వేశారు. కానీ దానికంటే మెరుగైన రీతిలో జీడీపీ వృద్ధి రేటు నమోదైంది.

భవిష్యత్ కోసం పొదుపు చేయాలా? 50-30-20 సూత్రాన్ని పాటించండి!

క్రెడిట్‌ కార్డ్‌ 'రివార్డ్​ పాయింట్స్​' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్​ పాటించండి!

Last Updated : Mar 4, 2024, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details