తెలంగాణ

telangana

అలర్ట్ - త్వరలో బంగారం ధర రూ.70వేలకు పెరిగే ఛాన్స్​ ​- కారణం ఏమిటంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 1:25 PM IST

Gold Rate Forecast 2024 : బంగారం కొనాలని అనుకుంటున్న వారికి అలర్ట్. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.66,000కు మించి పెరిగిపోయింది. అయితే త్వరలోనే ఇది రూ.70,000కు కూడా చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ పసిడి ధరల పెరుగుదలకు కారణం ఏమిటంటే?

gold rate forecast 2024
బంగారు నగలు

Gold Rate Forecast 2024 :ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ డీలర్లు, నగల వ్యాపారులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 వరకు చేరుకుంది. అయితే త్వరలోనే ఈ ధర రూ.70,000 వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపు పెట్టుబడిదారులు అందరూ మొగ్గుచూపుతున్నారు. ఫలితంగానే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

బ్యాంకింగ్ సంక్షోభం 2.0 వస్తుందా?

"మన దేశంలో బంగారం జీవనకాల గరిష్ఠాల వద్ద ట్రేడవుతోంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర దాదాపు 70 డాలర్ల (సుమారుగా రూ.5,800) వరకు పెరిగింది. వాస్తవానికి జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగారం ధర సుమారుగా 2000-2060 డాలర్ల రేంజ్​లో ఉండేది. కానీ నేడు గోల్డ్ రేటు అనేది 2100-2125 డాలర్ల రేంజ్​లోకి వచ్చేసింది. గతవారం న్యూయార్క్ కమ్యూనిటీ బాన్​కార్ప్​ (NYCB) షేర్లు భారీగా కుప్పకూలిపోయాయి. దీనితో యూఎస్​లో మరోసారి బ్యాంకింగ్ సంక్షోభం (బ్యాంకింగ్ క్రైసిస్​ 2.0) తలెత్తవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఫలితంగానే గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి."
- పృథ్వీరాజ్ కొఠారీ, మేనేజింగ్ డైరెక్టర్​, రిద్దిసిద్ధి బులియన్స్ లిమిటెడ్​ (ఆర్​ఎస్​బీఎల్​)

అవకాశం చేజారిపోతుందనే భయం (FOMO)
'యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన పసిడివైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు ఇంత మంచి ఛాన్స్​ తప్పిపోతుందేమో అనే భయం (FOMO)తోనూ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ బుల్లిష్​ మొమెంటం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. కనుక బంగారం ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర 65,500 దగ్గరకు వచ్చేసింది. త్వరలోనే అంటే ఈ 2024లోనే ఈ పసిడి ధర రూ.70,000 వరకు చేరుకునే అవకాశం ఉంది' అని పృథ్వీరాజ్ కొఠారీ అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు
'యూఎస్ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలతో, ఫిబ్రవరిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి' అని కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్​ కొలిన్ షా అన్నారు.

"యూఎస్​ ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది కీలక వడ్డీ రేట్లను 4 శాతానికి తగ్గించవచ్చని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, వినియోగ డిమాండ్​లు కూడా మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బహుశా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.70,000 చేరుకునే అవకాశం ఉంది."
- కొలిన్​ షా, కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్​

సురక్షితమైన పెట్టుబడిగా బంగారం
మన దేశ పజలకు బంగారం అంటే ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. చాలా మంది దీనిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఆపద సమయంలో బంగారం ఆదుకుంటుందని నమ్ముతారు. పైగా మన దేశంలో జనాభా చాలా ఎక్కువ. కనుక వీరు కొనే బంగారం పరిమాణం కూడా భారీగానే ఉంటుంది. దీనిని బట్టి తెలిసేదేమంటే, మన దేశంలో బంగారం వినియోగ రేటు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ధరలు కూడా భారీగా పెరుగుతాయి.

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?
'2023 డిసెంబర్​లో రికార్డ్​ స్థాయిలో బంగారం ధరలు 2,152 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అదే స్థాయిలో సోమవారం బలియన్ మార్కెట్లలో గోల్డ్ ట్రేడయ్యింది. చివరికి కామెక్స్ గోల్డ్​ భారీ లాభాలతో ముగిసింది. గతవారం యూఎస్​ బలహీనమైన ఆర్థిక గణాంకాలను ప్రకటించింది. దీనికి తోడు, ఫెడరల్ రిజర్వ్​ రానున్న నెలల్లో కీలక వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన చేస్తోంది. యూఎస్ ఐఎస్​ఎమ్ సేవలు, నిరుద్యోగం డేటా కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది' అని కోటక్ సెక్యూరిటీస్​ కమోడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్ర రావు అన్నారు.

బాగా డబ్బులు సంపాదించాలా? అయితే ఈ పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించండి!

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ABOUT THE AUTHOR

...view details