Flipkart Summary Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ 17 నుంచి 23 వరకు సమ్మర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రధానంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లను సరసమైన ధరలకే అమ్మనున్నట్లు ప్రకటించింది.
బంపర్ ఆఫర్స్
కొనుగోలుదారుల అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా అన్ని బ్రాండ్ల శీతలీకరణ ఉపకరణాలు (కూలింగ్ అప్లయెన్సెస్)ను ఈ సేల్‌లో విక్రయించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేకాదు వీటిపై బోలెడ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్ అందిస్తామని స్పష్టం చేసింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, న్యూ కస్టమర్ ఆఫర్లు కూడా ఉంటాయని పేర్కొంది. ట్యాప్ అండ్ విన్, సూపర్ కాయిన్ ఆఫర్స్ కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. పేమెంట్ ఆప్షన్ల విషయానికి వస్తే, నో-కాస్ట్ ఈఎంఐ, డౌన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది.
కస్టమర్ల కోసం స్పెషల్ కేర్!
వినియోగదారుల షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపరిచేందుకు 'వ్యూ ఇన్ 360', ఫైర్ డ్రాప్స్ గేమిఫికేషన్, 3డీ వ్యూయింగ్, ప్రీమియం సెలక్షన్స్‌కు వీడియో అసిస్టెన్స్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేకాదు, వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ జీవీస్ తక్కువ ఖర్చుతో ఇన్స్టాలేషన్ లాంటి పలు సర్వీస్‌లు కూడా అందిస్తుందని స్పష్టం చేసింది.
టాప్ బ్రాండ్స్ ఉన్నాయి!
- ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో శాంసంగ్, ఎల్జీ, వర్ల్‌పూల్, హైయర్, గోద్రెజ్, ఐఎఫ్బీ లాంటి టాప్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్లను సేల్కు ఉంచుతోంది. సింగిల్-డోర్, సైడ్-బై-సైడ్ డోర్, బోటమ్ మౌంట్, ఫ్రోస్ట్ ఫ్రీ, ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను సేల్కు తెస్తోంది.
- ఏసీల విషయానికి వస్తే ఎల్జీ, వోల్టాస్, గోద్రెజ్, డైకిన్, పానాసోనిక్, బ్లూస్టార్ బ్రాండెడ్ ఏసీలు అమ్ముతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. వీటి ప్రైస్ రేంజ్ రూ.25,000 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది.
- సీలింగ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే రూ.1299 నుంచి రూ.15,000 వరకు అన్ని వెరైటీల, బ్రాండ్ల ఫ్యాన్స్ లభిస్తాయి.
- కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వాడుకోవచ్చు. పాత రిఫ్రిజిటర్లపై గరిష్ఠంగా రూ.22,000 వరకు, పాత ఏసీపై గరిష్ఠంగా రూ.8000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.
పాన్ కార్డ్ లేదా? కానీ CIBIL స్కోర్ చెక్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Credit Score Without PAN Card
ఓలా బంపర్ ఆఫర్ - ఈవీల ధరలు భారీగా తగ్గింపు - ఇకపై రూ.69,999కే S1X స్కూటర్! - Ola EV Scooter Offers