తెలంగాణ

telangana

అప్పుడు రూ.11- ఇప్పుడు రూ.673 - మూడేళ్లలో 6000% లాభాన్నిచ్చిన స్టాక్​ తెలుసా? - Best Penny Stocks In 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 2:14 PM IST

Best Penny Stocks In 2024 : ఒకప్పటి పెన్నీ స్టాక్​ 'లాయిడ్స్ మెటల్స్​ అండ్ ఎనర్జీ' (LME) కేవలం మూడు ఏళ్లలోనే 6024% పెరిగి మదుపరులకు భారీ లాభాలు సంపాదించి పెట్టింది. పూర్తి వివరాలు మీ కోసం.

Lloyds Metals and Energy Ltd
Best Penny Stocks In 2024

Best Penny Stocks In 2024 : పెన్నీ స్టాక్​ 'లాయిడ్స్ మెటల్స్​ అండ్ ఎనర్జీ' (LME) మదుపరులకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2021 మార్చిలో రూ.11లుగా ఉన్న ఈ షేర్ వాల్యూ ఇప్పుడు రూ.673.70కు చేరుకుంది. అంటే కేవలం మూడేళ్లలోనే షేర్ వాల్యూ 6000 శాతం పెరిగింది.

విజయ ప్రస్థానం!
2021 మార్చిలో లాయిడ్స్ మెటల్స్​ అండ్ ఎనర్జీ షేర్ వాల్యూ కేవలం రూ.11 మాత్రమే ఉండేది. కానీ మొదటి ఏడాదిలోనే 136 శాతం వృద్ధితో రూ.284.70కు ఎగబాకింది. అయితే 2023 ఏప్రిల్ 25 నాటికి షేర్ వాల్యూ రూ.277.40లతో 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. కానీ తరువాత క్రమంగా పుంజుకున్న ఈ స్టాక్ అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ 2024 ఏప్రిల్​ 12 నాటికి రూ.710.50కు పెరిగింది. మదుపరులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

లాయిడ్స్ మెటల్స్​ అండ్ ఎనర్జీ - బిజినెస్ వివరాలు
ఎల్​ఎంఈ కంపెనీ ముంబయిలో 1977లో ప్రారంభమైంది. ఇది స్పాంజ్ ఐరెన్ ఉత్పత్తులను తయారు చేసి, విక్రయిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ కంపెనీ స్పాంజ్ ఐరెన్​, పవర్​, మైనింగ్ అనే మూడు సెగ్మెంట్​లను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది చార్​, ఫ్లై యాష్​, ఈఎస్​పీ డస్ట్​, బెడ్ మెటీరియల్స్, ఐరెన్ ఓర్​ ఫైన్స్ లాంటి బై-ప్రొడక్టులను కూడా విక్రయిస్తూ ఉంటుంది.

బోర్డ్ ఆఫ్ లాయిడ్స్​ మెటల్స్ అండ్ ఎనర్జీ గత నెలలో 'క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ ప్లేస్​మెంట్' (క్యూఐపీ) ద్వారా రూ.5 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ నిధులను విడతల వారీగా సేకరించే అవకాశం ఉంది.

లాభాలతో దూసుకుపోతోంది!
డిసెంబర్ త్రైమాసికంలో ఎల్​ఎంఈ కంపెనీ రూ.331 కోట్ల నికర ఆదాయాన్ని సంపాదించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నెట్ ప్రాఫిట్​ రూ.230 మాత్రమే. అంటే ఒక ఏడాదిలోనే కంపెనీ 44 శాతం అధికంగా లాభాలను నమోదు చేసింది. అలాగే కంపెనీ రెవెన్యూ కూడా 2023 డిసెంబర్ నాటికి రూ.1,910 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ రూ.999 కోట్లు మాత్రమే ఉండేది. అంటే ఒక ఏడాదిలోనే కంపెనీ రెవెన్యూ 99 శాతం పెరిగింది. ఇవన్నీ మదుపరుల సెంటిమెంట్​కు బలం చేకూర్చాయి. అందుకే ఒకప్పుడు పెన్నీ స్టాక్​గా ఉన్న షేర్ ఇప్పుడు మల్టీ బ్యాగర్​గా మారింది.

నోట్​ : పెన్నీ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఈ చిన్న కంపెనీల్లో నిధులు చాలా తక్కువగా ఉంటాయి. లాభాలు వస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు, వాటిని తట్టుకునే శక్తి ఈ చిన్న కంపెనీలకు ఉండదు. అందువల్ల పెన్నీ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని మాత్రమే సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

కంపెనీ 'గ్రాట్యుటీ' ఇవ్వడానికి నిరాకరిస్తోందా? ఇలా చేస్తే ప్రోబ్లమ్ సాల్వ్​! - Gratuity Problems And Solutions

సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారా? సింపుల్​గా రికవరీ చేసుకోండిలా! - Recovering Money From Cyber Scams

ABOUT THE AUTHOR

...view details