తెలంగాణ

telangana

బేబీ మిలియనీర్​ - 5 నెలల వయస్సులోనే రూ.4.2 కోట్ల సంపాదన​ - ఇంతకీ అతను ఎవరో తెలుసా? - Ekagrah Rohan Murty Networth

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 4:48 PM IST

Baby Millionaire Ekagrah Rohan Murty : ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు సంపాదిస్తున్నాడు. తాజాగా డివిడెండ్ రూపంలో ఏకంగా రూ.4.2 కోట్లు సంపాదించాడు. ఇంతకీ ఈ బాబు వయస్సు ఎంతో తెలుసా? కేవలం 5 నెలలు.

Baby Millionaire
Infosys founder

Baby Millionaire Ekagrah Rohan Murty : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడైన ఏకగ్రహ్​ రోహన్ మూర్తి ఇటీవలే దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్​గా అవతరించాడు. తాత కానుకగా అందించిన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లతో రూ.240 కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. తాజాగా డివిడెండ్ రూపంలో మరో రూ.4.2 కోట్లు సంపాదించి మరింత ఐశ్వర్యవంతుడయ్యాడు.

రూ.20+8 డివిడెండ్​
ఇన్ఫోసిస్​ బోర్డ్​ ఒక్కో షేర్​కు రూ.20 చొప్పున డివిడెంట్ అందించాలని నిర్ణయించింది. అలాగే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్పెషల్ డివిడెండ్​గా మరో రూ.8 చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం డివిడెండ్​ను ఈ జులై 1న చెల్లించనుంది.

1.51 కోట్ల షేర్లు!
నారాయణ మూర్తి గత నెలలో తన మనవడైనఏకగ్రహ్​కు 15 లక్షల షేర్లను కానుకగాఇచ్చేశారు. ఇంకా ఆయన చేతిలో 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే 0.36 శాతం ఇన్ఫోసిస్ షేర్లు నారాయణ మూర్తి వద్ద ఉన్నాయి.

ముద్దుల మనవడు
నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులకు రోహన్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన భార్య అపర్ణ 2023 నవంబర్​ 10న బెంగళూరులో ఏకగ్రహ్​కు జన్మనిచ్చారు. దీనితో నారాయణ మూర్తి దంపతులు నాన్నమ్మ, తాతయ్యలు అయ్యారు. వాస్తవానికి నారాయణ మూర్తి దంపతులకు ఇంతకు ముందే కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు మనవరాల్లు ఉన్నారు. వీరిద్దరూ యూకే ప్రధాని రిషి సునాక్​, అక్షత మూర్తిల పిల్లలు.

ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సుధామూర్తికి ఇన్ఫోసిస్ సంస్థలో 0.93 శాతం షేర్లు ఉన్నాయి. కొడుకు రోహన్​కు 1.64 శాతం, కుమార్తె అక్షతకు 1.05 శాతం షేర్లు ఉన్నాయి.

ఇన్ఫోసిస్ మహాప్రస్థానం!
నారాయణమూర్తి తన భార్య అయిన సుధామూర్తి వద్ద 250 డాలర్లు అంటే సుమారుగా 20 వేల రూపాయలు తీసుకుని 1981లో ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. దానిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ, నేడు దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా తీర్చిదిద్దారు. ఇలా 25 ఏళ్లు ఆహోరాత్రాలు కష్టపడి పనిచేసిన నారాయణమూర్తి 2021 డిసెంబర్​లో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి తన ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవా? రివార్డ్ పాయింట్స్​తో చెల్లించండిలా! - Use Reward Points To Pay CreditBill

మల్టిపుల్ పాన్ కార్డులు ఉన్నాయా? వెంటనే సరెండర్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Multiple Pan Card Issues

ABOUT THE AUTHOR

...view details