ETV Bharat / business

మల్టిపుల్ పాన్ కార్డులు ఉన్నాయా? వెంటనే సరెండర్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Multiple Pan Card Issues

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 1:12 PM IST

how to surrender duplicate pan card
Multiple Pan Card Issues

Multiple Pan Card Issues : మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఒక వేళ ఎవరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్​ కార్డులు ఉంటే, వారికి భారీగా జరిమానా విధిస్తారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఎక్స్​ట్రాగా ఉన్న పాన్​ కార్డులను ఎలా సరెండర్ చేయాలో తెలుసుకుందాం.

Multiple Pan Card Issues : మన దేశంలో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా 'పర్మినెంట్ అకౌంట్ నెంబర్' (PAN) అవసరం. ఈ పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్ నంబర్ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. పన్ను ప్రయోజనాల కోసం ఐడెంటిఫికేషన్ నంబర్​లా పాన్ కార్డు పనిచేస్తుంది. ఆదాయ పన్ను శాఖ ఈ పాన్​ కార్డ్​ ద్వారా, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుంది. పన్ను ఎగవేతలను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుంది.

చట్ట విరుద్ధం!
మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ ప్రకారం, ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే సెక్షన్ 272బీ ప్రకారం జరిమానా విధిస్తారు. అందుకే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే, ఆ ఎక్స్​ట్రా పాన్ కార్డ్​లను ఆదాయ పన్నుశాఖవారికి సరెండర్ చేయాలి. అది ఎలా అంటే?

How To Surrender Extra Pan Card Online :

  • ముందుగా మీరు NSDL ఆన్​లైన్ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
  • పోర్టల్​లో Application Type డ్రాప్​డౌన్​ మెనూలోకి వెళ్లి PAN Correction ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • తరువాత మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.
  • స్కాన్ చేసిన ఫొటోలను అప్లోడ్ చేయండి.
  • మీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్న పాన్ నంబర్​ను సెలెక్ట్ చేయండి.
  • తరువాత మీరు సరెండర్ చేయాలని అనుకుంటున్న పాన్ కార్డుల వివరాలు నమోదు చేయండి.
  • ఐడెంటిటీ ప్రూఫ్​, చిరునామా, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
  • వీటికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, ఆన్​లైన్​లోనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి.
  • ఈ ప్రాసెసింగ్ ఫీజ్​ను డిమాండ్ డ్రాఫ్ట్​; క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
  • ఫీజు చెల్లించిన తరువాత అక్నాలెడ్జ్​మెంట్ కార్డును డౌన్​లోడ్ చేసుకోండి. దీనికి మీ ఫొటో అంటించి NSDLకు పంపించండి.

How To Surrender Extra Pan Card Offline :

  • పాన్ కరెక్షన్ ఫారమ్ తీసుకుని, దానిని పూరించి, సమీపంలోని NSDL కలక్షన్ కేంద్రంలో సమర్పించండి.​
  • మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ కార్డుల వివరాలను తెలుపుతూ అసెసింగ్​ అధికారికి ఒక లేఖ రాయండి. వాటిని రద్దు చేయమని కోరండి.
  • అవసరమైతే అఫిడవిట్​ను కూడా దాఖలు చేయండి. అంతే సింపుల్​!
  • ఈ విధంగా మీరు ఆఫ్​లైన్​లో కూడా అదనపు పాన్ కార్డులను సరెండర్ చేయవచ్చు.

ఈ విషయాలు తెలుసుకోండి!
ఆన్​లైన్​లో పాన్ సరెండర్ ఫారమ్ సబ్మిట్ చేశాక 15 రోజుల్లోగా అక్నాలెడ్జ్​మెంట్​ కార్డును NSDLకు పంపించాలి. ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అందుకే పాన్ సరెండర్​కు సంబంధించిన అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అదనపు పాన్​ కార్డులను రద్దు చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. కనుక ఓపికగా ఉండాలి. అవసరమైతే నేరుగా అసెసింగ్ అధికారిని కలిసి మీ సందేహాలను తీర్చుకోవాలి.

EPF అకౌంట్ బ్లాక్ అయిందా? ఇలా చేస్తే అంతా సెట్! - How To Unblock EPF Account

రూపే క్రెడిట్ కార్డ్ నయా ఫీచర్స్ - యూపీఐ యాప్​లోనే EMI,​ లిమిడ్ ఇంక్రీజ్​ ఫెసిలిటీ! - New Rupay Credit Card Rules 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.