తెలంగాణ

telangana

గుమ్మడి కాయ హల్వా టేస్ట్‌లో బెస్ట్‌ అంతే! ఈజీగా ఇలా చేసేద్దాం! - Pumpkin Halwa Recipe

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 5:33 PM IST

Pumpkin Halwa Recipe At Home : పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తినే స్వీట్‌ రెసిపీలలో హల్వా ఒకటి. అయితే, మీరు ఇప్పటి వరకు క్యారెట్, బ్రెడ్‌లతో హల్వా ప్రిపేర్ చేసుకొని ఉండవచ్చు. కానీ, ఎప్పుడైనా గుమ్మడి కాయతో హల్వాను ట్రై చేశారా? లేదంటే ఇప్పుడే ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి.

Pumpkin Halwa Recipe At Home
Pumpkin Halwa Recipe At Home

Pumpkin Halwa Recipe At Home : పండగలు, శుభకార్యాల వంటివి ఏదైనా ఇంట్లో జరిగితే తప్పకుండా ఒక స్వీట్‌ రెసిపీ ఉండాల్సిందే. అందుకే.. చాలా మంది అందరికీ ఇష్టమైన హల్వా రెసిపీని తయారు చేస్తుంటారు. అయితే, ఎప్పుడు హల్వాను క్యారెట్‌లు, బ్రెడ్‌లతో కాకుండా ఈ సారి కొత్తగా గుమ్మడి కాయతో ట్రై చేయండి. ఒక్కసారి ఈ హల్వాని రుచి చూశారంటే, పిల్లల నుంచి పెద్దల వరకూ మరొక కప్పు తినడం గ్యారెంటీ. అంత బాగుంటుంది మరి ఈ గుమ్మడి హల్వా! అలాగే ఈ గుమ్మడి కాయ హల్వా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయలో మన శరీరానికి కావాల్సిన ఫైబర్‌, పొటాషియం, విటమిన్లు వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం సింపుల్‌గా టేస్టీగా గుమ్మడి కాయ హల్వాను ఎలా ప్రిపేర్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • గుమ్మడి కాయ - అర కిలో
  • నెయ్యి -కప్పు
  • జీడిపప్పులు- పది
  • చక్కెర -కప్పు
  • యాలకుల పొడి- అరచెంచా
  • దోసగింజలు- చెంచా
  • ఉప్పు- చిటికెడు

చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా..

సూపర్‌ టేస్టీ గుమ్మడికాయ హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం :

  • ముందుగా గుమ్మడి కాయను శుభ్రంగా కడిగి కట్‌ చేసుకోవాలి.
  • తర్వాత అందులోని గింజలను మొత్తం తీసేయాలి. అలాగే గుమ్మడి కాయపైన ఉన్న చెక్కును కూడా తొలగించాలి.
  • ఇప్పుడు గుమ్మడికాయను గ్రేటర్‌ సహాయంతో సన్నగా తురుముకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్‌ చేసి ఒక పాన్‌ను పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యిని వేసి తరిగిన గుమ్మడి కాయ తురుము వేసి బాగా వేయించుకోవాలి.
  • ఈ మిశ్రమం 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి సరిపడినంత షుగర్‌ను వేసుకోండి.
  • హల్వాలో చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కాస్త చిక్కగా మారుతుంది.
  • ఇలా చిక్కగా మారిన తర్వాత యాలకుల పొడి, దోసకాయ గింజలను వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ గుమ్మడి హల్వా మరింత టేస్ట్‌గా ఉండాలంటే, మీరు చిటికెడు ఉప్పును కూడా యాడ్‌ చేసుకోవచ్చు.
  • అంతే, ఇలా చేస్తే ఎంతో అద్భుతంగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ!
  • దీనిని వేడివేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.
  • మరి మీరు కూడా ఈ టేస్టీ గుమ్మడికాయ హల్వాను మీ ఇంట్లో ట్రై చేయండి!

పుట్టగొడుగులతో నోరూరించే వంటలు

నోరూరించే కశ్మీరీ దమ్​ ఆలూ.. మీరూ ట్రై చేయండి

ABOUT THE AUTHOR

...view details