ETV Bharat / priya

నోరూరించే కశ్మీరీ దమ్​ ఆలూ.. మీరూ ట్రై చేయండి

author img

By

Published : Apr 14, 2021, 1:01 PM IST

బంగాళాదుంపతో రుచికరమైన వంటలు ఎన్నో చేయవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో రుచికరమైన ఈ కశ్మీరీ దమ్​ ఆలూను ఓసారి ట్రై చేయండి.

Receipe for kashmiri alu
కశ్మీరీ దమ్​ ఆలూ.. మీరు ట్రై చేశారా?

బంగాళాదుంపతో ఏది చేసినా రుచికరంగానే ఉంటుంది. ఇతర కూరగాయలతోనూ వీటిని జత చేసి వండుకుంటాం. బంగాళాదుంపతో ఇప్పటికి ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు. మరి కశ్మీరీ దమ్​ ఆలూను ట్రై చేశారా? ఇదిగో ఈ రెసిపీ మీకోసమే...

కావలసినవి:-

  • బేబీ పొటాటో- అరకిలో
  • పెరుగు- 8 టేబుల్​ స్పూన్లు
  • ఉల్లిపాయలు- రెండు
  • పుదీనా ఆకులు- సరిపడా
  • నూనే- 6 టేబుల్​ స్పూన్లు
  • శొంఠిపొటి- 2 టేబుల్​ స్పూన్లు
  • జాజికాయ పొడి- చిటికెడు
  • గరం మసాలా- చిటికెడు
  • తాజామీగడ- 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • అల్లంవెల్లులి- 3 టేబుల్​ స్పూన్లు
  • కశ్మీరీ కారం- 4 టేబుల్​ స్పూన్లు
  • కొత్తిమీర తురుము 3 టేబుల్​ స్పూన్లు

తయారీ..

బంగాళాదుంపల్ని ఉడికించి తొక్క తీయాలి. ఫోర్క్​తో బంగాళాదుంపలకు గాట్లు పెట్టి కాగిన నూనెలో బంగారు వర్ణంలోకి మారే వరకూ వేయించి తీయాలి. ఇప్పుడు ఓ బాణాలిలోకి కచ్చాపచ్చగా రుబ్బిన ఉల్లిముక్కలు, పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, కశ్మీరీ కారం, గరం మాసాలా, శొంఠిపొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి.

అందులోనే వేయించిన బంగాళాదుంపలు, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులు, ఉప్పు వేసి స్టవ్​ మీద పెట్టి సిమ్​లో సుమారు అరగంటసేపు ఉడికించి దించాలి. అంతే.. కశ్మీరీ దమ్​ ఆలూ రెడీ.

ఇదీ చూడండి:- రెస్టారెంట్ స్టైల్ శాండ్​విచ్ ఇంట్లోనే చేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.